న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో పరీక్ష: ఒత్తిడిలో టీమిండియా, నేడు బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్

By Nageshwara Rao
India vs Bangladesh: Nidahas Trophy 2018: Team India Under pressure
Nidahas Trophy preview: India look to bounce back against Bangladesh

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా టీమిండియా మరో పరీక్షకు సిద్ధమైంది. భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న యువ క్రికెటర్లకు మరో అద్భుత అవకాశం. ఈ నేపథ్యంలో భాగంగా రెండో టీ20 లీగ్ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ క్రికెటర్లు లేకుండా శ్రీలంకకు వెళ్లిన భారత్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది.

టోర్నీలో భాగంగా జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ల్లో తడబడి లంక చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్ ఓటమితో పాయింట్ల పట్టికలో ఖాతా తెరువలేకపోయిన టీమిండియా ఫైనల్ ఆశలు క్లిష్టం కాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో మార్పులు ఏమైనా చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఫామ్‌లో లేని కెప్టెన్

ఫామ్‌లో లేని కెప్టెన్

తొలి టీ20లో పెద్దగా ఆకట్టుకోని రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్‌కి అవకాశం ఇస్తారా లేదా చూడాలి. ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతున్నా... జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్‌ ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్ శర్మ ఈ కీలక మ్యాచ్‌లోనైనా పుంజుకుంటాడని జట్టు ఆశిస్తోంది. ధావన్‌తో కలిసి రోహిత్ శర్మ శుభారంభాన్నివ్వడం ఎంతో ముఖ్యం.

 దినేశ్ కార్తీక్‌కు మరో అవకాశం

దినేశ్ కార్తీక్‌కు మరో అవకాశం

ఇక, ఈ సిరిస్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న సురేశ రైనా సైతం ఈ మ్యాచ్‌లో రాణించాల్సి ఉంది. మనీష్ పాండే ఫర్వాలేదనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవుతున్నాడు. దినేశ్ కార్తీక్‌కు మరో అవకాశం దక్కొచ్చు. ఇక, ఈ మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే దిగే అవకాశాలున్నాయి. చాహల్‌కు తోడుగా మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను ఆడించే అవకాశముంది. టీ20 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొవడం ఎప్పుడూ సవాలే.

 బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మహ్మదుల్లా

బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మహ్మదుల్లా

గాయపడ్డ షకిబ్‌ స్థానంలో బంగ్లాకు మహ్మదుల్లా నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ఈ టోర్నీలో మూడో జట్టుగా దిగుతున్న బంగ్లాదేశ్.. ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించింది లేదు. గత నెలలో తమ దేశంలో లంక చేతిలో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను చేజార్చుకుని ఒత్తిడిలో పడింది. అయితే పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. ఈ ఫార్మాట్‌లో గతంలో బంగ్లాతో తలపడిన 5 మ్యాచ్‌ల్లో భారతే గెలిచింది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రైనా, మనీష్, రిషబ్, కేఎల్ రాహుల్, కార్తీక్, సుందర్, అక్షర్ పటేల్, శంకర్, శార్దూల్, సిరాజ్, ఉనాద్కట్, చాహల్.

బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, కైస్, ముష్ఫికర్, షబ్బీర్, ముస్తాఫిజుర్, రొబెల్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్, హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ ఇస్లామ్.

పిచ్‌, వాతావరణం

ప్రేమదాస మైదానం ఎక్కువగా స్లో పిచ్‌. అయితే సిరీస్‌ ఆరంభంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృత్తంగా ఉంటుంది.

ప్రత్యక్ష ప్రసారం: DSports/DDSports from 7 pm onwards

Story first published: Thursday, March 8, 2018, 11:36 [IST]
Other articles published on Mar 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X