న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ తర్వాత ఏం జరిగింది?: నాగిని డ్యాన్సులతో గేలి, డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసం

By Nageshwara Rao
Nidahas Trophy 2018 : Players Fights after Match
Nidahas Trophy: Bangladesh dressing room glass door allegedly broken by players

హైదరాబాద్: నిదాహస్‌ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి పైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.

మ్యాచ్‌ చివరి ఓవర్లో బంగ్లాదేశ్-శ్రీలంక ప్లేయర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో మ్యాచ్‌ నిలిచిపోతుందేమో అనిపించేలా బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే.. ఎట్టకేలకి ఆ జట్టు కోచ్, అంపైర్లు చొరవ తీసుకుని ఆటగాళ్లని శాంతపరచడంతో.. మ్యాచ్ కొనసాగింది. ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు.

అసలు ఏం జరిగిందంటే?

బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 160

బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 160

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో మహ్మదుల్లా (43 నాటౌట్: 18 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. కానీ చివరి ఓవర్ వేసిన శ్రీలంక బౌలర్ ఉదాన.. తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ బంతులుగా విసిరాడు.

 నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్లతో బంగ్లా ఆటగాళ్ల గొడవ

నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్లతో బంగ్లా ఆటగాళ్ల గొడవ

అయితే.. వాటిని క్రీజులో ఉన్న ముస్తాఫిజుర్ బ్యాట్‌తో తాకించలేకపోయాడు. ఈ క్రమంలో రెండో బంతికి పరుగు కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. ఈ సమయంలో మహ్మదుల్లా‌కి డ్రింక్స్ తీసుకొచ్చిన సబ్‌స్టిట్యూడ్ ఫీల్డర్ నూరుల్.. శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరాతో గొడవపడ్డాడు. బంతి బ్యాట్స్‌మెన్‌ భుజం కన్నా ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నోబాల్ ఇవ్వాలంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్లని డిమాండ్ చేశారు.

మ్యాచ్ నిలిపివేసి బయటకు వచ్చేయండి

మ్యాచ్ నిలిపివేసి బయటకు వచ్చేయండి

ఫీల్డ్ అంపైర్లు వారి అభ్యర్థని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి మైదానంలోని ఆటగాళ్లను మ్యాచ్ నిలిపివేసి వచ్చేయాలంటూ సైగలు చేస్తూ పిలిచాడు. అప్పటికి 4 బంతుల్లో బంగ్లా 12 పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ సూచన మేరకు క్రీజులో ఉన్న మహ్మదుల్లా, రుబెల్ మైదానం వెలుపలకి వచ్చేసేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు వారికి సర్దిచెప్పారు. మరోవైపు కెప్టెన్‌కి బంగ్లాదేశ్ కోచ్, జట్టు మేనేజర్‌ ఖాలెద్‌ మెహమూద్‌ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్‌ కొనసాగించారు.

4, 2, 6 బాది బంగ్లాకు విజయాన్ని అందించిన మహ్మదుల్లా

4, 2, 6 బాది బంగ్లాకు విజయాన్ని అందించిన మహ్మదుల్లా

ఆ తర్వాత మహ్మదుల్లా వరుసగా 4, 2, 6 బాది ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. గెలుపు అనంతరం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మైదానంలో సంబరాలతో హోరెత్తించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్‌ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది శ్రీలంక బోర్డుకు ఫిర్యాదుచేశారు.

 డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసంపై విచారణ ఆదేశించిన బోర్డు

డ్రెస్సింగ్‌ రూమ్‌ అద్దాలు ధ్వంసంపై విచారణ ఆదేశించిన బోర్డు

దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది.

Story first published: Saturday, March 17, 2018, 18:03 [IST]
Other articles published on Mar 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X