న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా మద్ధతు భారత జట్టుకే: లంకేయులు

Nidahas Trophy 2018 final: Sri Lankans to support Team India against Bangladesh

హైదరాబాద్: నిదహాస్ ట్రోఫీలో భాగంగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు భారత్, బంగ్లాదేశ్‌కు
ఇరు జట్లు సిద్ధమయ్యాయి. మరి కొద్ది గంటల్లో మొదలుకాబోతున్న ఈ మ్యాచ్‌కు భారత జట్టు క్రికెటర్లకు లంక క్రికెట్ అభిమానులు మద్దతిస్తామంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్ అని తేల్చి చెప్పేశారు. శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో లంకపై బంగ్లా గెలుపొందిన విషయం తెలిసిందే.

శ్రీలంక క్రికెట్‌కు చెందిన ప్రముఖ సీనియర్ చీర్ లీడర్ పెర్సీ అబేశేఖర మాట్లాడుతూ.. ఫైనల్‌లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయానికొస్తే.. నేనైతే భారత్‌ను ఉత్సాహపరుస్తానని చెప్పారు. పొరుగుదేశం భారత్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి. ఘర్షణ వాతావారణం నెలకొన్న సమయంలో మేమంతా పరస్పపరం సహకరించుకున్నాం. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. శ్రీలంక ఫైనల్ చేరి ఉంటే మా జట్టుకు మద్దతు ఇచ్చేవాడిని. దురదృష్టవశాత్తు శుక్రవారం మ్యాచ్‌లో పెవిలియన్‌లో ఉన్న షకిబ్ తమ బ్యాట్స్‌మెన్ మైదానం వదిలిరావాలని సూచించి పెద్ద తప్పుచేశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దం అంతేకాదు ముఖ్యంగా ఇది అవివేక చర్య అని ఆయన అన్నారు.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన ఆఖరి ఓవర్లో ఊహించని మలుపులు.. వాగ్వాదాలు.. ఉత్కంఠ నడుమ మ్యాచ్ జరిగింది. ఈ మొహమ్మదుల్లా చేసిన వీరోచిత ఇన్నింగ్స్‌తో గెలుపొందిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్లు మైదానంలో నాగిని డ్యాన్స్ చేయడం.. ఆజట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ చొక్కా విప్పి అత్యుత్సాహం ప్రదర్శించడంతో లంక అభిమానులు బంగ్లాదేశ్ జట్టుపై తీవ్ర వ్యతిరేఖత పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న టైటిల్ పోరుకు తమ మద్దతు భారత్‌కే ఉంటుందని వారంతా బహిరంగంగా వెల్లడించడం విశేషం.

మార్చి 18న కొలంబో వేదికగా తలపడనున్న ఇరు జట్లు ఇవే:
India:
Rohit Sharma(c), Shikhar Dhawan, KL Rahul, Suresh Raina, Manish Pandey, Dinesh Karthik, Deepak Hooda, Washington Sundar, Yuzvendra Chahal, Rishabh Pant, Axar Patel, Vijay Shankar, Shardul Thakur, Jaydev Unadkat, Mohammed Siraj

Bangladesh:
Shakib Al Hasan(c), Tamim Iqbal, Soumya Sarkar, Mushfiqur Rahim, Sabbir Rahman, Mustafizur Rahman, Rubel Hossain, Abu Jayed, Liton Das, Mahmudullah, Taskin Ahmed, Imrul Kayes, Nurul Hasan, Mehidy Hasan, Ariful Haque, Nazmul Islam, Abu Hider Rony

Story first published: Sunday, March 18, 2018, 16:36 [IST]
Other articles published on Mar 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X