టీ20: ధావన్ హాఫ్ సెంచరీ, బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్

Posted By:
India vs Bangladesh T20 Highlights : India thrash Bangladesh
Nidahas Trophy 2018

హైదరాబాద్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(17) మరోసారి నిరాశపరచగా, శిఖర్‌ ధావన్‌(55) హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

సురేశ్‌ రైనా(28) ఫర్వాలేదనిపించగా, మనీష్‌ పాండే(27 నాటౌట్‌) చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. దినేశ్ కార్తీక్ 2 పరుగులు చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.


మూడో వికెట్ కోల్పోయిన భారత్
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20లో భారత్ 110 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్(52), పాండే 3 పరుగులతో ఉన్నారు. దూకుడుగా ఆడే క్రమంలో సురేశ్ రైనా(28) పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు రోహిత్ శర్మ 17, పంత్ 7 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే.


శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. 40 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా నడిపిస్తున్నారు.
ఈ క్రమంలో వీరిద్దరి జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మరోవైపు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో ఈ సిరిస్‌లో రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్‌ 14 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.


రెండు వికెట్లు కోల్పోయి భారత్
140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 17, పంత్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 37 పరుగులు చేశాడు. రైనా 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు.


తొలి వికెట్ కోల్పోయిన భారత్
నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (17) పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో నాలుగు ఓవర్లకు గాను వికెట్ నష్టానికి భారత్ 33 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (10), రిషాబ్ పాన్ట్ (5) పరుగులతో ఉన్నారు.


భారత్ విజయ లక్ష్యం 140
నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో గురువారం భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 140 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత బౌలర్లు దెబ్బకు బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లిటన్ దాస్(34) దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 107 పరుగుల వద్ద దాస్ చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

బంగ్లాదేశ్ జట్టు భారాన్ని షబ్బీర్ రహ్మాన్ తీసుకున్నాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 30 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించక పోవడంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ మూడు, విజయ్ శంకర్ రెండు, శార్ధూల్, చాహల్ చెరో వికెట్ తీశారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. కొలంబో వేదికగా రెండో టీ20 లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

భారత్ Vs బంగ్లాదేశ్ టీ20 లైవ్ స్కోరు కార్డు

దీంతో టీమిండియా ఫైనల్ ఆశలు క్లిష్టం కాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా మహ్మదుల్లా నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో బంగ్లాదేశ్‌తో తలపడిన 5 మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించింది.

జట్ల వివరాలు:
భారత్‌:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, రిషబ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, విజయ్ శంకర్, యజువేంద్ర చాహల్‌, శార్దూల్ ఠాకూర్‌, జయదేవ్ ఉనాద్కత్

శ్రీలంక:
చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా.

Story first published: Thursday, March 8, 2018, 18:53 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి