బాల్ టాంపరింగ్‌కు పాల్పడి వీడియోలో అడ్డంగా దొరికాడు: పూరన్‌పై 4 మ్యాచ్‌ల నిషేధం (వీడియో)

West Indies Batsman Nicholas Pooran Suspended For Ball Tampering || Oneindia Telugu

హైదరాబాద్: వెస్టిండిస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేరానికి పూరన్ బహిరంగ క్షమాపణ కూడా చెప్పడం విశేషం.

ఈ నిషేధంతో నికోలస్ పూరన్ వెస్టిండిస్ తరుపున నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో ఐదు డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. దీంతో లక్నో వేదికగా వెస్టిండిస్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య గురువారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో అతడు ఆడటం అనుమానంగానే ఉంది.

ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను భయపెట్టిన భారత బౌలర్ ఎవరో తెలుసా?

లెవల్ 3 ఉల్లంఘన

ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 3 ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను నికోలస్ పూరన్‌కు నాలుగు సస్పెన్షన్ పాయింట్లు ఇవ్వడం జరిగిందని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్టికల్ 2.14ను ఉల్లంఘించినట్లు నికోలస్ పూరన్‌పై అభియోగం మోపబడింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సమక్షంలో అభియోగాలను నికోలస్ పూరన్ అంగీకరిచడంతో ఐసీసీ నిషేధం విధించింది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

లోక్నో వేదికగా జరిగిన మూడో వన్డేలో బంతిని అందుకున్న నికోలస్ పూరన్ దానిపై ఉన్న తేమని తుడిచే నెపంతో బాల్ టాంపరింగ్‌కి యత్నించాడు. ఇందులో భాగంగా తన గోటితో బలంగా పదే పదే రుద్దడం ద్వారా బాల్ టాంపరింగ్‌కి పాల్పడ్డాడు. ఈ తతంగం మొత్తం వీడియోలో స్పష్టంగా రికార్డు కావడంతో ఐసీసీ నికోలస్ పూరన్‌పై చర్యలకు ఉపక్రమించింది.

నేను తప్పు చేశానని గుర్తించా

నికోలస్ పూరన్ మాట్లాడుతూ "నేను తప్పు చేశానని గుర్తించాను. ఐసీసీ పెనాల్టీని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇది ఒక వివిక్త సంఘటన, భవిష్యత్తులో ఇది పునరావృతం కాదు. జట్టులోని తోటి సహచర క్రికెటర్లకు, సపోర్టర్లకు, ఆప్ఘనిస్థాన్ జట్టుకు నా క్షమాపణలు తెలియజేస్తున్నాను" అని అన్నాడు.

పెనాల్టీగా నాలుగు సస్పెన్షన్ పాయింట్లు

zఐసీసీ లెవెల్ 3 ఉల్లంఘనకు పాల్పడితే కనీసం నాలుగు సస్పెన్షన్ పాయింట్ల పెనాల్టీని విధిస్తుంది. ఒక ఆటగాడి రికార్డులో ఐదు డీమెరిట్ పాయింట్లు జత చేరితే రెండు టెస్ట్ మ్యాచ్‌లు లేదా నాలుగు వన్డే/టీ20 మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ విధిస్తుంది. గరిష్టంగా 12 సస్పెన్షన్ పాయింట్లు లేదా ఆరు డీమెరిట్ పాయింట్లు జరిమానాగా ఉంటుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 13, 2019, 16:37 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X