న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇకపై కెమెరా ఎక్కడుందో చూస్తా!: థర్డ్‌ అంపైర్‌ని తిట్టడంపై రోహిత్ శర్మ (వీడియో)

 ‘Next time I’ll check where the camera is’ – Rohit Sharma on abusing third umpire

హైదరాబాద్: ఇకపై కెమెరా ఎక్కడుందో చూసుకుంటానని టీమిండియా తాత్కాలికె కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మైదానంలో ప్రశాంతంగా కనిపించే రోహిత్‌శర్మ రాజ్‌కోట్ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో థర్డ్‌ అంపైర్‌పై తన కోపాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ విషయంలో తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో రోహిత్ అతనిపై అసభ్య పదజాలం వాడాడు.

దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ "మైదానంలో నేను భావోద్వేగంతో ఉంటాను. గత మ్యాచ్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మైదానంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అలా జరిగింది. నిజానికి ఫీల్డింగ్‌లో మా జట్టు కాస్త అలసత్వం ప్రదర్శించింది. అంతిమంగా లక్ష్యం ఏమిటంటే మ్యాచ్‌లో గెలవాలని కోరుకుంటాం. కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాం. ఇకపై కెమెరా ఎక్కడుందో చూసుకుంటా(నవ్వుతూ)" అని అన్నాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

బంగ్లా ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ను స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ వేస్తున్నాడు. చహల్‌ వేసిన ఓ బంతికి సౌమ్య సర్కార్‌ (30; 2 ఫోర్లు, 1 సిక్స్)ను రిషభ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌కు అనుమానం ఉండడంతో థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. అంపైర్‌ నిర్ణయం కోసం సౌమ్య సర్కార్‌ బౌండరీ లైన్‌ వద్ద నిరీక్షిస్తున్నాడు.

సౌమ్య క్లియర్‌గా ఔట్‌ అని రిప్లైలో

సౌమ్య క్లియర్‌గా ఔట్‌ అని రిప్లైలో తేలినా.. స్క్రీన్‌ మీద నాటౌట్‌ అని డిస్‌ప్లే అయ్యింది. స్క్రీన్‌ చూసిన రోహిత్‌ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్‌ అంపైర్‌ పక్కన ఉండగానే థర్డ్‌ అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే సౌమ్య ఔటేనని ఫోర్త్‌ అంపైర్‌ ప్రకటించాడు. అంపైర్‌పై రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

సిరిస్ 1-1తో సమం

సిరిస్ 1-1తో సమం

ఇదిలా ఉంటే, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి టీ20లో గనుక బంగ్లాదేశ్ విజయం సాధిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే టీ20 క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్‌పై టీ20 సిరిస్ నెగ్గలేదు.

Story first published: Saturday, November 9, 2019, 14:39 [IST]
Other articles published on Nov 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X