న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంకను ఉతికారేసిన టామ్ లాథమ్, తానొక్కడే 264పరుగులతో..

New Zealand vs Sri Lanka, 1st Test: Tom Latham strokes epic 264 as SL stare at defeat

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ లాథమ్ ఆదేశ టెస్టు క్రికెట్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో పరుగుల సునామీ సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన లాథమ్ మొత్తం 489 బంతులు ఆడి 21ఫోర్లు, సిక్స్ సాయంతో 264 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరోచిత పోరాటంతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో తన జోరు తగ్గించలేదు. కివీస్ ఇన్నింగ్స్ ముగిసేవరకు క్రీజులో ఉన్న లాథమ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు.

లంక బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా

లాథమ్‌ను ఔట్ చేసేందుకు భారీ వ్యూహాలు రచించి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం ఫలించలేదు. లంక బౌలర్లకు ఎక్కడా చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఆడేశాడు. ఓర్పు, సహనంతో ఆచితూచి బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్‌కు భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించాడు.

578 పరుగులకు లాథమ్ ఒక్కడే 264 పరుగులు

జట్టులో తన స్కోరే హైలెట్‌గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 578 పరుగులు చేస్తే.. లాథమ్ ఒక్కడే 264 పరుగులు చేశాడు. అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ సహకరిస్తే అలవోకగా 300 మార్క్‌ను అందుకునే లాథమ్‌కు ఆ అవకాశం కుదరలేదు. లంక బౌలర్ లాహిర్ కుమారా బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ ఔటవడంతో కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగుల ఆధిక్యంతో లభించింది. లంక బౌలర్లకు విసుగు తెప్పించేలా బ్యాటింగ్ చేసిన టామ్ చివరికి అవుట్ అవకుండానే కివీస్ ఇన్నింగ్స్‌ పూర్తి అయింది.

276 పరుగులు వెనుకబడిన లంక

మూడో రోజు ఆట ముగిసేసరికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 20 పరుగులు చేసింది. అయినా లంక ఇంకా 276 పరుగులు వెనకబడి ఉంది. స్వల్ప స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంక అనూహ్య ప్రదర్శన చేస్తే తప్ప ఓటమి భారం నుంచి బయటపడే సూచనల్లేవు. కివీస్ మిగిలిన ఏడు వికెట్లు పడగొడితే సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించనుంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 282 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Story first published: Monday, December 17, 2018, 17:25 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X