న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

24 పరుగులకే రెండు వికెట్లు .. బర్న్స్‌, రూట్‌ సెంచరీలు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్‌ దీటైన జవాబు

New Zealand vs England 2nd Test: Joe Root, Rory Burns fightback on rain-curtailed day

హామిల్టన్‌: సెడాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ రోరీ బర్న్స్‌ (101), జో రూట్‌ (114 బ్యాటింగ్‌)లు సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్‌ కోలుకుంది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను బర్న్స్‌- రూట్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ న్యూజిలాండ్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 177 పరుగులు జోడించారు.

ఆరు వికెట్లతో స్టార్క్‌ విజృంభణ.. పాక్ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలం!!ఆరు వికెట్లతో స్టార్క్‌ విజృంభణ.. పాక్ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలం!!

మొదటగా ఓపెనర్ బర్న్స్‌ సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం బర్న్స్‌ పెవిలియన్ చేరినా... రూట్‌కు బెన్‌ స్టోక్స్‌ జతకలిశాడు. స్టోక్స్‌ అండతో రూట్ సెంచరీ చేసాడు. అయితే స్టోక్స్‌ (26) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. సౌథీ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత జాక్‌ క్రావ్లే (1) కూడా ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 262 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఓలీ పాప్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రూట్‌ (114), పాప్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. టిమ్‌ సౌథీకి రెండు వికెట్లు లభించగా.. మ్యాట్‌ హెన్రీ, నీల్‌ వాగ్నర్‌లు తలో వికెట్‌ తీశారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 173/3తో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్‌.. లాథమ్‌ (105), నికోల్స్‌ (16) వికెట్లను త్వరగానే కోల్పోయింది.

ఈ దశలో తొలి మ్యాచ్‌ డబుల్‌ సెంచరీ హీరో వాట్లింగ్‌ (55), అరంగేట్ర ఆటగాడు డారిల్‌ మిషెల్‌ (73) ఆకట్టుకోవడంతో కివీస్‌ కోలుకుంది. స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్ మూడు వికెట్లు తీసాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. మూడో రోజు కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 106 పరుగుల వెనుకబడి ఉంది.

Story first published: Sunday, December 1, 2019, 12:44 [IST]
Other articles published on Dec 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X