న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

232 నాటౌట్: వన్డేల్లో కివీస్ మహిళా క్రికెటర్ ప్రపంచ రికార్డు

By Nageshwara Rao
New Zealand teenager Amelia Kerr smashes record ODI score of 232* against Ireland

హైదరాబాద్: మహిళల క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ క్రికెటర్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 490 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అమీలియా కెర్

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అమీలియా కెర్

ఆ రికార్డుని మరిచిపోకముందే న్యూజిలాండ్ మహిళల జట్టు మరో ప్రపంచ రికార్డు తమ పేరిట లిఖించుకుంది. ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో కివీస్ యువ ఓపెనర్ అమీలియా కెర్(145 బంతుల్లో 232 నాటౌట్, 31ఫోర్లు, 2సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

మహిళా క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

మహిళా క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

మహిళా క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడంతో పాటు, అతి చిన్న వయసులోనే(17 సంవత్సరాల 243 రోజులు) ఈ రికార్డు సాధించిన ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు ఇది రెండో డబుల్ సెంచరీ మాత్రమే. మొదటి డబుల్‌ సెంచరీని ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిందా క్లార్క్‌(229) సాధించారు.

ఈ రికార్డు 21 ఏళ్ల రికార్డు బద్దలు

ఈ రికార్డు 21 ఏళ్ల రికార్డు బద్దలు

1991లో డెన్మార్క్‌పై బెలిందా క్లార్క్‌ ఈ రికార్డు నెలకొల్పింది. అప్పటికి అమీలియా జన్మించకపోవడం విశేషం. మొత్తంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన ఏడో వ్యక్తిగా (రోహిత్‌ శర్మ మూడు డబుల్‌ సెంచరీలు సాధించాడు) అమిలియా కెర్‌ నిలిచింది. అమీలియా ఇన్నింగ్స్‌లో 31ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లు ఉన్నాయి.

305 పరుగుల తేడాతో కివీస్ భారీ విజయం

అమీలియా విధ్వంసానికి తోడు కాస్ప్రెక్(113) సెంచరీతో కివీస్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 440/3 స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 44 ఓవర్లలో 135/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న అమీలియా (5/17)బౌలింగ్‌లో కూడా రాణించడంతో న్యూజిలాండ్ 305 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరిస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

Story first published: Thursday, June 14, 2018, 11:32 [IST]
Other articles published on Jun 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X