న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదోసారి: నాటకీయ పరిణామాల మధ్య కివీస్ ఘన విజయం

By Nageshwara Rao
New Zealand secure innings victory as England pay for first-day collapse

హైదరాబాద్: వర్షం కారణంగా రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకు పోయింది. అయినా సరే న్యూజిలాండ్‌ పట్టు వదల్లేదు. చివరి రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న తొలి టెస్టు (డే/నైట్‌)లో ఆతిథ్య న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.

రెండు జట్ల మధ్య 102 టెస్టుల చరిత్రలో న్యూజిలాండ్ నెగ్గడం ఇది పదోసారి. ఓవర్‌నైట్‌ స్కోరు 132/3తో చివరిరోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆటలో ఇంకో 18.5 ఓవర్లు మిగిలుండగా ఇంగ్లాండ్‌ 320 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌(66) ఆదుకొనే ప్రయత్నం చేశాడు.

క్రిస్ వోక్స్‌ (52) కూడా గట్టిగానే పోరాడాడు. వీరిద్దరి జోడీ 30 ఓవర్లకు పైగా వికెట్‌ పడకుండా అడ్డుకోవడంతో ఇంగ్లాండ్‌కు డ్రా అవకాశాలు మెరుగ్గానే కనిపించాయి. అయితే రెండో సెషన్‌ చివరి ఓవర్లో 66 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బెన్ స్టోక్స్ ఏడో వికెట్‌ రూపంలో ఔట్ కావడంతో ఇంగ్లాండ్‌ పరిస్థితి తారుమారైంది.

మిగిలిన 3 వికెట్లతో ఇంగ్లాండ్‌ చివరి సెషన్‌ను ముగించలేకపోయింది. లంచ్ విరామం అనంతరం ఆట ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఆ జట్టు ఆలౌటైంది. ఇంగ్లాండ్ జట్టులో ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ స్టోన్‌మన్‌, స్టోక్స్‌, వోక్స్‌ల వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను వాగ్నర్‌ దెబ్బకొట్టాడు.

కివీస్ బౌలర్లు వాగ్నర్‌ (3/77), బౌల్ట్‌ (3/67), టాడ్‌ ఆస్టల్‌ (3/39) ఇంగ్లాండ్ పతనంలో కీలకపాత్ర పోషించారు. బౌల్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 58 పరుగులకే ఆలౌట్ కాగా.. కివీస్‌ 427/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు ఏప్రిల్‌ 3న ఆరంభమవుతుంది.

సంక్షిప్తస్కోరు:
ఇంగ్లండ్‌: 58, 320 (స్టోన్‌మన్‌ 55, స్టోక్స్‌ 66, క్రిస్‌ వోక్స్‌ 52, బౌల్ట్‌ 3/67);
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 427/8 డిక్లేర్డ్‌.

Story first published: Tuesday, March 27, 2018, 7:59 [IST]
Other articles published on Mar 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X