న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడు వేలంలో అన్‌సోల్డ్‌ ప్లేయర్.. ఇప్పుడు రాజస్తాన్ స్పిన్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు!!

New Zealand legspinner Sodhi named Rajasthan Royals spin consultant and operations executive

హైదరాబాద్: న్యూజిలాండ్ స్టార్ లెగ్‌ స్పిన్నర్ ఇష్ సోధీని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 కోసం ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు స్పిన్ కన్సల్టెంట్‌గా రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ఎంపిక చేసింది. గురువారం సోధీని జట్టులోకి ఎంపిక చేసినట్టు రాజస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. దీంతో 27 ఏళ్ల ఇష్ సోధీ ఐపీఎల్ 2020లో కొత్త అవతారం ఎత్తనున్నాడు.

రాబిన్ ఉతప్ప వన్డే జట్టు: కెప్టెన్‌గా ధోనీ.. ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు!!రాబిన్ ఉతప్ప వన్డే జట్టు: కెప్టెన్‌గా ధోనీ.. ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు!!

 స్పిన్ కన్సల్టెంట్‌గా సోధీ:

స్పిన్ కన్సల్టెంట్‌గా సోధీ:

గత డిసెంబర్ నెలలో జరిగిన వేలం సందర్భంగా సోధీని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఈ లెగ్‌ స్పిన్నర్‌ని తీసుకోవడానికి ఏ ప్రాంచైజీ ముందుకురాలేదు. అయితే సోధీని టీమ్ మేనేజ్‌మెంట్‌లోకి తీసుకుంటునట్లు తాజాగా రాజస్థాన్ నిర్ణయించింది. గత రెండు సీజన్లలో సోధీ రాజస్థాన్ తరపునే ప్రాతినిధ్యం వహించాడు.

 కీలక బాధ్యతలు:

కీలక బాధ్యతలు:

సోధీ మార్గదర్శకంలో రాజస్థాన్ జట్టులోని స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా శ్రేయస్ గోపాల్ గతేడాది హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. ఇవన్ని పరిశీలించిన రాజస్థాన్ యాజమాన్యం అతనికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. స్పిన్ కన్సల్టెంట్‌గా స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులేతో సోధీ కలిసి పనిచేయనున్నాడు. అలాగే చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ జేక్ లాష్‌ మెక్రమ్‌తో కలిసి ఆపరేషన్ ఎగ్గిక్యుటివ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు.

స్మిత్ బాధ్యతలు:

స్మిత్ బాధ్యతలు:

సోధీ సహాయాక కోచ్ రూపంలో జట్టులోకి రావడాన్ని గోపాల్ స్వాగతించాడు. గతంలో అతనితో ఆడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆనందం వ్యక్తం చేశాడు. 2008లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్.. మళ్లీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. గతేడాది లీగ్ దశకే పరిమితమైంది. సారధిగా అజింక్య రహానే విఫలమవడంతో అతని స్థానంలో స్టీవ్ స్మిత్ బాధ్యతలు చేపట్టాడు.

 ఫ్రాంచైజీని ప్రేమిస్తున్నా:

ఫ్రాంచైజీని ప్రేమిస్తున్నా:

తాజా నియామంకపై సోధీ సానుకూలంగా స్పందించాడు. 'కొత్త పాత్రలో రాయల్స్ కుటుంబానికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాయల్స్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా. గత రెండు సీజన్లలో ఆటగాళ్లతో ఉన్నా కాబట్టి వారిపై మంచి అవగాహన ఉంది. వారినుంచి చాలా మద్దతు లభించింది. నేను ఈ ఫ్రాంచైజీని ప్రేమిస్తున్నా. ఈ సంవత్సరం టైటిల్ గెలవడానికి నా వంతు సహాయం చేస్తా' అని సోధీ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, January 2, 2020, 17:04 [IST]
Other articles published on Jan 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X