న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాకి బదులు న్యూజిలాండ్ జెండా ఎగరేసి..

New Zealand flag hoisted instead of Australias during first day of Dubai Test

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తప్పిదం చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో రెండు దేశాలు జెండాలు ఎగరేయడం ఆనవాయితీ. కానీ ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జెండా బదులు న్యూజిలాండ్‌ జెండా ఎగరేశారు. దీనిని ఎవ్వరూ గమనించకపోవడం విడ్డూరం. అయితే ఆసీస్‌ జర్నలిస్టు ఈ విషయాన్ని పసిగట్టి ట్వీటర్‌లో పోస్ట్‌ చేశాడు.

1
44238
తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసి

తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసి

ఇది కాస్త వైరల్‌ అయి దుబాయ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడ పట్ల ఆసీస్‌ అభిమానులు విమర్శించారు. దీంతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన స్టేడియం నిర్వాహకులు.. రెండు దేశాల జెండాలు ఒకే రీతిలో ఉండటంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. క్రికెట్‌లో ఇలాంటి సంఘటనలు జరగటం కొత్తేం కాదు.

భారత జాతీయ జెండాను తలకిందులుగా

భారత జాతీయ జెండాను తలకిందులుగా

గతంలో కూడా ఓ మ్యాచ్‌లో భారత జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. మ్యాచ్‌ మధ్యలో ఆ విషయాన్ని గుర్తించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంపైర్లకు చెప్పి సరిచేపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. పాక్‌ సిరీస్‌లో రాణించి పునర్వైభవం సాధించాలనుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించలేదు.

పాకిస్తాన్‌ 482 పరుగుల భారీ స్కోర్‌

పాకిస్తాన్‌ 482 పరుగుల భారీ స్కోర్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్తాన్‌ 482 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. పసతగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌పై పాక్‌ బ్యాట్స్‌మెన్‌ పైచేయి సాధించారు. ఓపెనర్‌ మొహ్మద్‌ హఫీజ్‌ (126), హారీస్‌ సోహైల్‌ (110) సెంచరీలతో రెచ్చిపోయారు. వీరికి తోడుగా ఇమాముల్‌ హక్‌(76), అసద్‌ షఫీఖ్‌(80) హాఫ్ సెంచరీలతో రాణించారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి

రెండో రోజు ఆట ముగిసే సమయానికి

ఆసీస్‌ బౌలర్లలో సిడిల్‌ మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్‌ రెండు వికెట్లు, హోలండ్‌, స్టార్క్‌, ల్యాబస్‌చేంజ్‌ తలో వికెట్‌ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో ఆసీస్‌ ఓపెనర్లు ఖవాజా (17), ఫించ్‌(13)లు ఉన్నారు.

Story first published: Tuesday, October 9, 2018, 11:40 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X