న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జహీర్‌ నేతృత్వంలో నా బౌలింగ్‌‌ను మరింత పటిష్టం చేసుకున్నా'

New Zealand Bound Sid Kaul Credits Zaheer for Refining His Basics

హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ ఖాన్‌ తన బౌలింగ్‌ను పూర్తిగా మార్చేశాడని పంజాబ్‌ పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ అన్నాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్‌ కౌల్‌ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో కౌల్‌ మాట్లాడుతూ "నా తొలి ప్రాధాన్యం దేశవాళీ క్రికెట్‌కే. పంజాబ్‌ తరఫున చేసిన ప్రదర్శనలే జాతీయ జట్టులో అవకాశం దక్కేలా చేశాయి" అని అన్నాడు.

అమ్మకానికి రాజస్థాన్‌ రాయల్స్‌ 50 శాతం వాటా: రేసులో ఉన్నది వీరేఅమ్మకానికి రాజస్థాన్‌ రాయల్స్‌ 50 శాతం వాటా: రేసులో ఉన్నది వీరే

"న్యూజిలాండ్‌లో భారత్‌-ఏ తరఫున బౌలింగ్‌ చేశా. అక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉంది. ఎప్పుడూ జట్టు గెలుపు కోసమే కష్టపడతా. నా మార్గనిర్దేశకుడు జహీర్‌ ఖాన్‌ నేతృత్వంలో నా బౌలింగ్‌‌ను మరింత పటిష్టం చేసుకున్నా. ఆయన చక్కని సలహాలు ఇస్తారు. బంతులు విసిరేటప్పుడు సింపుల్‌గా ఉండాలని సూచిస్తారు" అని పేర్కొన్నాడు.

నా బౌలింగ్‌ గురించి నోట్స్‌

నా బౌలింగ్‌ గురించి నోట్స్‌

"ఆయన నాతో చాలా సమయం గడిపారు. నా బౌలింగ్‌ గురించి నోట్స్‌ రాసుకున్నారు. బంతులు విసిరేటప్పుడు ఏ కండరాలు ఉపయోగించాలి, ఏ ప్రాంతాల్లో బంతులు వేయాలో చెప్పారు. భారత్‌-ఏ తరఫున న్యూజిలాండ్‌ వెళ్లేటప్పుడూ ఆయనతో మాట్లాడాను. ఆ సలహాలు అద్భుతంగా ఉపయోగపడ్డాయి" అని సిద్ధార్థ్‌ కౌల్‌ చెప్పుకొచ్చాడు.

రాహుల్‌ సర్‌ గురించి

రాహుల్‌ సర్‌ గురించి

"భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ సర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నాలెడ్జిని వెలకట్టలేం. ఆయన సలహాలు నాకెంతగానో ఉపయోగపడ్డాయి" అని చెప్పాడు. పంజాబ్‌ తరఫున సిద్ధార్థ్‌ కౌల్‌ రంజీల్లో అద్ఫుత ప్రదర్శన చేశాడు. భారత్‌-ఏ తరఫున అదరగొట్టాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

కివీస్ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టీ20లు

కివీస్ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టీ20లు

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీసేన ఆడే టీ20 మ్యాచ్‌లను వెల్లింగ్టన్, ఆక్లాండ్, హమిల్టన్‌లలో నిర్వహించనున్నారు. అదే సమయంలో భారత మహిళల జట్టు కూడా న్యూజిలాండ్‌‌లో పర్యటించనుంది. మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.

ఇండియా-ఏ జట్టు కూడా

ఇండియా-ఏ జట్టు కూడా

ఇండియా-ఏ జట్టు కూడా జనవరిలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. న్యూజిలాండ్‌-ఏతో 3 నాలుగు రోజుల మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. నాలుగు రోజుల మ్యాచ్‌లను వరుసగా మౌంట్ మౌంగనుయి, సెడాన్ పార్క్, కోబం ఓవల్‌లో నిర్వహించనుండగా.. వన్డేలకు బే ఓవల్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Story first published: Friday, January 18, 2019, 11:28 [IST]
Other articles published on Jan 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X