న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలైట్ గ్రూపు: చెన్నై టెస్టులో అశ్విన్ కొత్త రికార్డు ఇదే

చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డుని తన సొంత మైదానమైన చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో అశ్విన్ అధిగమించాడు.

ఐదో టెస్టు నాలుగో రోజైన సోమవారం బ్యాటింగ్‌కు దిగిన ఈ సిరిస్‌లో 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ సిరిస్‌లో ఆల్ రౌండర్‌గా అశ్విన్ 28 వికెట్లతో పాటు 250 పరుగులకు పైగా సాధించాడు.

దీంతో ఒక టెస్టు సిరిస్‌లో 250కి పైగా పరుగులు, 25కి పైగా వికెట్లు సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. 1979-80 మధ్య కాలంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో 6 మ్యాచ్‌ల్లో కపిల్ దేవ్ 278 పరుగులు, 32 వికెట్లు తీసుకున్నాడు.

కపిల్ తర్వాత ఇన్నాళ్లకు అశ్విన్ మళ్లీ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా టెస్టు క్రికెట్‌లో ఈ ఘనతను అందుకున్న ఏడో క్రికెటర్‌గా అశ్విన్ గుర్తింపు పొందాడు. చివరిసారిగా 1985లో ఇంగ్లాండ్‌కు చెందిని ఇయాన్ బోథమ్ ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు ఈ ఫీట్‌ను బోథమ్ రెండుసార్లు అందుకున్నాడు.

New record: R Ashwin emulates Kapil Dev, joins elite list of 7players

ఒక టెస్టు సిరిస్‌లో 250+ పరుగులు, 25 వికెట్లకు పైగా సాధించిన వారు:
రవిచంద్రన్ అశ్విన్ (India) Vs England in 2016 (270 runs and 28 wickets) - Ashwin's stats as on 12.55 PM on Monday (December 19). He is batting on 31
ఇయాన్ బోథమ్ (England) Vs Australia in 1985 (250, 31) Botham Vs Australia in 1981 (399, 34)
కపిల్ దేవ్ (India) Vs Pakistan in 1979-80 (278, 32)
ట్రెవర్ గోడార్డ్ (South Africa) Vs Australia in 1966 (294, 26)
రిచీ బినౌ్డ్ (Australia) Vs South Africa in 1957 (329, 30)
ఆబ్రే ఫల్కనర్ (South Africa) Vs England in 1910 (545, 29)
జార్జి గోఫిన్ (Australia) Vs England in 1894 (474, 34)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X