న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న చనిపోయినా ఏడవలేదు, సర్దార్‌జీ వేషంపై 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకంలో దాదా

By Nageshwara Rao
New book: Sourav Ganguly writes about crying, 'The End' and his father's death

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భావోద్వేగాలను దాచుకోలేడన్న విషయం మనకు తెలిసిందే. చాలా సందర్భాల్లో మైదానంలో మనం ఈ విషయాన్ని గమనించాం. అలాంటి దాదా.. తన తండ్రి చనిపోయినపుడు మాత్రం ఏడవలేదట. ఈ విషయాన్ని దాదానే స్వయంగా 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకావిష్కర కార్యక్రమంలో వెల్లడించాడు.

'అవును.. మా నాన్న చనిపోయినప్పుడు ఏడవలేదు. చాలా మంది ఈ విషయాన్ని నమ్మకపోవచ్చు. నేను నిజం చెప్పడం లేదని అనుకోవచ్చు. కానీ కొందరైనా నేను చెప్పేది నమ్ముతారు. నాలాంటి వాళ్లు కొంత మంది ఉంటారు. ఏడిస్తే బాధ తీరిపోతుందని చాలా మంది అనుకుంటారు. నాలాంటి వాళ్లు మాత్రం భావోద్వేగాలను లోపలే దాచుకుంటారు. బయటకు గంభీరంగా కనిపించినా లోపల మాత్రం బాధ ఉంటుంది' అని గంగూలీ తెలిపాడు.

తాను గౌతమ్‌ భట్టాచార్యతో కలిసి రచించిన 'ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర సంఘటనలు చాలానే ఉన్నాయని గంగూలీ చెప్పుకొచ్చాడు. దుర్గ నవరాత్రి ఉత్సవాలప్పుడు సర్దార్‌జీ వేషధారణలో తానెలా బయటకు వెళ్లేవాడినో కూడా ఈ పుస్తకంలో రాశానని దాదా చెప్పాడు.

కోల్‌కతాలో వైభవంగా నిర్వహించే దుర్గ పూజ‌కి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు గంగూలీ ఈ వేషం వేశాడట. 'ఫ్యామిలీతో కలిసి దుర్గాపూజలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనాలంటే.. హర్భజన్ సింగ్‌ తరహా వేషధారణలోకి మారాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే.. లక్షల సంఖ్యలో భక్తులు ఆ పూజకి హాజరవుతారు. వారి మధ్యకి గంగూలీలా వెళితే ఇబ్బందులు ఎదురవుతాయి' అని గంగూలీ తెలిపాడు.

'అందుకే సర్దార్‌జీగా మారిపోయా. మా బంధువుల్లో కొందరు నన్ను గుర్తు పట్టి ఎగతాళి చేశారు. అవేమీ నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత.. వాళ్లే అర్థం చేసుకున్నారు. దుర్గామాత విగ్రహం ఉన్న ట్రక్‌లోకి సర్దార్‌జీ వేషంలో ఉన్న నన్ను పోలీసులు అనుమతించలేదు. దీంతో కారులో నా భార్య, కూతురుతో కలిసి ఆ ట్రక్‌‌ని అనుసరించా' అని గంగూలీ తెలిపాడు.

'ప్రయాణం మధ్యలో ఓ పోలీస్ ఇన్‌స్ఫెక్టర్ కారు అద్దంలోంచి నన్ను నిశితంగా పరిశీలించి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆయన నన్ను గుర్తుపట్టాడని నిర్ధారించుకున్న నేను.. ఎవరితోనూ చెప్పవద్దని సూచించాను. అలానే.. ఉత్సవం మొత్తం బాగా ఎంజాయ్ చేశా. ఏడాది‌కి ఒకసారి వచ్చే ఈ ఉత్సవాలకి హాజరయ్యేందుకే ఆ వేషం వేయాల్సి వచ్చింది' అని గంగూలీ వివరించాడు.

వీటితో పాటు తన రిటైర్‌మెంట్‌, అప్పటి కెప్టెన్‌ అనిల్ కుంబ్లే అందించిన సహకారం, గ్రెగ్‌ ఛాపెల్‌ గురించి ఇలా చాలా విషయాలను ఇందులో పొందుపరిచానని గంగూలీ ఈ సందర్భంగా తెలిపాడు. భారత్ తరఫున విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, February 3, 2018, 9:50 [IST]
Other articles published on Feb 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X