న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏకాగ్రతలో పుజారా తర్వాతే సచిన్, ద్రవిడ్: ఆసీస్ కోచ్ ప్రశంస

Never seen a batsman concentrate like Pujara and that includes Tendulkar, Dravid: Langer

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ కూడా పుజారా బ్యాటింగ్‌ను కొనియాడాడు. పుజారా మాదిరి ఏకాగ్రతతో ఆడే బ్యాట్స్‌మెన్‌ను మరొకరిని చూడలేదని ప్రశంసించాడు.

ద్రవిడ్ పుట్టినరోజు: సెహ్వాగ్ ట్వీట్ అదుర్స్, నెటిజన్లు సైతం మెచ్చారుద్రవిడ్ పుట్టినరోజు: సెహ్వాగ్ ట్వీట్ అదుర్స్, నెటిజన్లు సైతం మెచ్చారు

ఏకాగ్రత విషయంలో పుజారా క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు రాహుల్ ద్రవిడ్‌ను కూడా మించిపోయాడంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. శనివారం నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ పుజారా ఏకాగ్రత బౌలర్లకు ఛాలెంజ్ అని చెప్పాడు.

ఏకాగ్రతలో

ఏకాగ్రతలో

"బంతిని పుజారాలా నిశితంగా గమనించే బ్యాట్స్‌మెన్‌ను మరొకర్ని చూడలేదు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కూడా అతడికి సాటిరారు. మేం అతడిలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం" అని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

521 పరుగులు చేసిన పుజారా

521 పరుగులు చేసిన పుజారా

ఈ సిరిస్‌లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లాడిన పుజారా 1,238 బంతులు ఎదుర్కొని 521 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులు చేసిన త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో పుజారా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.

ఇప్పటి వరకూ అత్యధిక బంతులు

ఇప్పటి వరకూ అత్యధిక బంతులు

ఈ సిరిస్‌కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉండగా తాజాగా ఆ రికార్డుని పుజారా అధిగమించాడు. 2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో ద్రవిడ్ 1,203 బంతులతో ఆ రికార్డ్‌ని నెలకొల్పగా.. పుజారా 1,258 బంతులతో దానిని బద్దలు కొట్టాడు.

పుజారాదే కీలకపాత్ర

పుజారాదే కీలకపాత్ర

ఈ జాబితాలో మూడో స్థానంలో విజయ్ హజారే (1947-48) 1,192 బంతులతో ఉండగా.. విరాట్ కోహ్లీ (2014-15) 1,093 బంతులు, సునీల్ గవాస్కర్ (1977-78) 1,032 బంతులతో టాప్-5లో ఉన్నారు. ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరిస్‌ను నెగ్గడంలో పుజారాదే కీలకపాత్ర. పుజారాతో పాటు భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.

వన్డేల్లోనూ బలంగా టీమిండియా

వన్డేల్లోనూ బలంగా టీమిండియా

ఇక, కోహ్లీసేన టెస్టుల్లో ఉన్నంత బలంగానే వన్డేల్లోనూ ఉందని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. భారత్‌ను భారత గడ్డ మీద ఓడించడం తన కెరీర్లో గొప్ప మైలురాయి అని చెప్పిన లాంగర్... విరాట్ కోహ్లి కూడా ఇప్పుడు అలాగే ఫీలవుతున్నాడని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, January 11, 2019, 14:09 [IST]
Other articles published on Jan 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X