న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విషయం ఏంటంటే!: కోహ్లీకి క్షమాపణ చెప్పిన నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్!

Netherlands batsman ‘apologises’ for beating Virat Kohli and Babar Azam to top spot in elite ODI list

హైదరాబాద్: నెదర్లాండ్స్‌ బ్యాట్స్‌మన్‌ ర్యాన్‌ టెన్‌ డషెట్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పాకిస్థాన్ యువ క్రికెటర్ బాబర్ ఆజాంలకు క్షమాపణ చెప్పాడు. ఇంతకీ అతడు చేసిన తప్పేంటో తెలుసా? వన్డేల్లో వీరిద్దరితో పోలిస్తే అతడి సగటు ఎక్కువగా ఉండటమే. వివరాల్లోకి వెళితే...

వన్డేల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మన్‌గా నెదర్లాండ్స్‌ బ్యాట్స్‌మన్‌ ర్యాన్‌ టెన్‌ డషెట్‌(67)తో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(60.31), బాబర్‌ అజామ్‌(54.55) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

CPL 2019: క్రిస్ గేల్ గోల్డెన్ డకౌట్ వీడియో చూశారా?CPL 2019: క్రిస్ గేల్ గోల్డెన్ డకౌట్ వీడియో చూశారా?

ESPN క్రిక్‌ఇన్ఫో ట్వీట్

ఈ విషయాన్ని ESPN క్రిక్‌ఇన్ఫో తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. తన ట్విట్టర్‌లో ఆయా క్రికెటర్ల ఫొటోలతో పోస్టు చేస్తూ "కచ్చితంగా వారు నీకంటే యావరేజ్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రం కాదు" అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్టుని చూసిన ర్యాన్‌ టెన్‌ డషెట్‌ కోహ్లీ, బాబర్ అజాంకు క్షమాపణలు చెబుతున్నానని రీట్వీట్ చేశాడు.

ర్యాన్‌ టెన్‌ డషెట్‌ చేసిన ట్వీట్‌పై

నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్ ర్యాన్‌ టెన్‌ డషెట్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ మునవీర తన ట్విట్టర్‌లో అతడిని "GOAT" అంటూ సంబోధించాడు. ఇక, ర్యాన్‌ టెన్‌ డషెట్‌ విషయానికి వస్తే నెదర్లాండ్స్ తరుపున ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 67 సగటుతో 1541 పరుగులు చేశాడు.

2011 వన్డే వరల్డ్‌కప్‌లో రెండు సెంచరీలు

ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. భారతదేశం ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా రెండు సెంచరీలు సాధించాడు. 2011 నుంచి 2015 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఐదు సీజన్ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలిచినప్పుడు ఆ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు.

ఎసెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం

ఎసెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం

ఇంగ్లిష్‌ కౌంటీ క్రికెట్‌లో ఎసెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతమూడేళ్లలో ఆ జట్టు రెండుసార్లు ఇంగ్లీషు కంట్రీ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ర్యాన్‌ టెన్‌ డషెట్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు.

Story first published: Friday, October 4, 2019, 14:50 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X