న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్ టీ20: 11 బంతుల్లో విజయ లక్ష్యాన్ని చేధించిన నేపాల్

Nepal Humiliate China, Take Just 11 Balls To Chase Down Target

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ టీ20 ఆసియా రీజియన్ క్వాలిఫయర్ బి మ్యాచుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఆరు పరుగుల లక్ష్యాన్ని పది బంతుల్లోనే చేధించి మలేషియా సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

<strong>హైదరాబాద్ టెస్ట్: భారత బౌలర్ల జోరు, టీ విరామానికి వెస్టిండిస్ 197/6</strong>హైదరాబాద్ టెస్ట్: భారత బౌలర్ల జోరు, టీ విరామానికి వెస్టిండిస్ 197/6

ఇప్పుడు తాజాగా నేపాల్ జట్టు సరిగ్గా అలాంటిదే రికార్డునే నమోదు చేసింది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని కేవలం 11 బంతుల్లోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చైనా 13 ఓవర్లలో కేవలం 26 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత 27 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ జట్టు 11 బంతుల్లోనే చేధించింది.

లక్ష్య చేధనలో నేపాల్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో చైనాకిది వరుసగా ఐదో ఓటమి కాగా.. నేపాల్‌కు వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చైనా జట్టు ఒకానొక దశలో వికెట్ నష్టానికి 21 పరుగులతో పటిష్టంగానే ఉంది.

ఆ తర్వాత అదే స్కోరు వద్ద ఏకంగా ఐదు వికెట్లు కోల్పోవడంతో 21/1గా ఉన్న స్కోరు 21/6గా మారిపోయింది. ఏడుగురు చైనా బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఐపీఎల్‌ 2108 సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానె నాలుగు ఓవర్లలో నాలుగు పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, October 12, 2018, 16:19 [IST]
Other articles published on Oct 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X