న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు: న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నెర్ అరుదైన రికార్డు

Neil Wagner Becomes Second Fastest NZ Bowler to Pick 200 Test Wickets

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో న్యూజిలాండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ నీల్ వాగ్నెర్‌ అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించిన వాగ్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు తీశాడు. దీంతో టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఫలితంగా కివీస్ తరుపున అరుదైన ఘనత సాధించాడు.

Australia vs New Zealand: బాక్సింగ్ డే టెస్టులో డీఆర్ఎస్ డ్రామా! (వీడియో)Australia vs New Zealand: బాక్సింగ్ డే టెస్టులో డీఆర్ఎస్ డ్రామా! (వీడియో)

రిచర్డ్‌ హ్యాడ్లీ తర్వాత

న్యూజిలాండ్‌ మాజీ దిగ్గజ పేసర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ తర్వాత టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. రిచర్డ్‌ హ్యాడ్లీ 44 టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోగా... వాగ్నర్ తన 46వ టెస్టులో ఈ మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ట్రెంట్‌ బౌల్ట్‌(52 మ్యాచ్‌లు), టిమ్‌ సౌథీ(56 మ్యాచ్‌లు), క్రిస్‌ కెయిన్స్‌(58 మ్యాచ్‌లు)లు ఉన్నారు.

200 వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ బౌలర్ల జాబితాలో

అత్యంత వేగవంతంగా టెస్టుల్లో 200 వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ బౌలర్ల జాబితాలో వాగ్నర్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత వాగ్నర్‌ నిలిచాడు. జడేజా తన 44వ టెస్టులో రెండొందల టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

ఇప్పటికే 13 వికెట్లు తీసిన వాగ్నెర్

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వాగ్నర్‌ ఇప్పటికే 13 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో వాగ్నర్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

456 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా

ప్రస్తుతం ఆస్ట్రేలియా 456 పరుగుల ఆధిక్యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Saturday, December 28, 2019, 17:30 [IST]
Other articles published on Dec 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X