దీపావళి 'బాణసంచా' రగడ: అక్రమ సంతానం వ్యాఖ్యలపై మసాబా స్పందన

Posted By:

హైదరాబాద్: దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు పలికిన ఓ బాలీవుడ్ ప్యాషన్ డిజైనర్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకున్నారు. అయితే ఆమెను తిట్టిన వారందరికీ సమాధానం చెబుతూ గట్టిగానే పోస్టు పెట్టింది. వివరాల్లోకి వెళితే... వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భాగంగా సుప్రీంకోర్టు దీపావళికి బాణసంచాను నిషేధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై ఇప్పటికే ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ చేసిన ట్వీట్‌ను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, వెస్టిండిస్ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌, నటి నీనా గుప్తాల కుమార్తె మసాబా గుప్తా రీట్వీట్‌ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నువ్వు ఓ అక్రమ సంతానం

హిందూ ధర్మం గురించి నీకేం తెలుసు? అని ప్రశ్నిస్తూ నువ్వు ఓ అక్రమ సంతానం అంటూ ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమెపై దూషణకు దిగిన ప్రతి ఒక్కరికీ ఆమె గట్టిగా సమాధానం చెప్పింది. 'నన్ను బాస్టర్డ్‌ చైల్డ్‌, అక్రమంగా భారతదేశంలో ఉంటున్న వెస్ట్‌ ఇండియన్‌ మహిళ అంటూ తిడుతున్నారు. మీరీ మాటలంటున్నప్పుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది' అని పేర్కొంది.

 నేను ఇద్దరు ప్రముఖులకు పుట్టాను

నేను ఇద్దరు ప్రముఖులకు పుట్టాను

'నేను ఇద్దరు ప్రముఖులకు (వివ్‌ రిచర్డ్స్‌, నీనా గుప్తా) పుట్టాను. అంతేకాదు, నాకు నచ్చినట్టుగా, కష్టపడి నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మలుచుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నా పదేళ్ల వయసు నుంచీ నన్నిలాగే తిడుతున్నారు. నా ధర్మం.. నేను చేసే పని, సమాజానికి నేను అందించే సేవల్లోనే ఉంటుంది' అని ఆమె తెలిపింది.

నాపై వేలెత్తి చూపే అవకాశం ఉండదు

నాపై వేలెత్తి చూపే అవకాశం ఉండదు

'కనుక మీరు ఎంత ప్రయత్నించినా నాపై వేలెత్తి చూపే అవకాశం ఉండదు. కాబట్టి నన్ను ఇలాంటి పదాలతో మీరు దూషిస్తే అవి నన్ను మరింత గర్వపడేలా చేస్తాయి. ఇంకో విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలి, అదేంటంటే, నేను ఇండో-కరీబియన్‌ యువతినైనందుకు గర్వపడుతున్నాను' అంటూ వెల్లడించింది. ఆమె సమాధానంపై పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు, మద్దతు లభిస్తోంది.

 దీపావళి పర్వదిన సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా అమ్మకాలపై

దీపావళి పర్వదిన సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా అమ్మకాలపై

సుప్రీం కోర్టు సోమవారం నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించింది. న్యూఢిల్లీలో కాలుష్యం పాళ్లు తగ్గించే దిశగానే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ 1వ తేదీ వరకూ బాణసంచాను నిల్వ చేయడం గానీ, వినియోగించడం కానీ చేయరాదు. దేశ రాజధాని ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌ 11న టపాసుల అమ్మకం లైసెన్సులను సస్పెండ్‌ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది.

Story first published: Friday, October 13, 2017, 11:56 [IST]
Other articles published on Oct 13, 2017
Please Wait while comments are loading...
POLLS