న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నయీమ్‌ హసన్‌ విజృంభణ.. జింబాబ్వేపై బంగ్లా ఇన్నింగ్స్‌ విజయం

Nayeem, Taijul dismantle Zimbabwe to secure innings win for Bangladesh

ఢాకా: జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో నయీమ్‌ హసన్‌ (5/82), తైజుల్‌ ఇస్లామ్‌ (4/78) హడలెత్తించడంతో బంగ్లా సునాయాస విజయం అందుకుంది. దీంతో టెస్ట్ ఫార్మాట్‌లో గత 15 నెలలుగా బంగ్లా వరుస ఓటములకు బ్రేక్‌ పడింది. 2018 విండీస్‌పై చివరి టెస్టు విజయాన్ని రుచి చూసిన బంగ్లాకు తమ క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో ఇన్నింగ్స్‌ గెలుపు.

రంజీ సెమీఫైనల్లో ఆడనున్న కేఎల్‌ రాహుల్‌!రంజీ సెమీఫైనల్లో ఆడనున్న కేఎల్‌ రాహుల్‌!

ఓవర్‌నైట్‌ స్కోరు 9/2తో మంగళవారం ఆట కొనసాగించిన జింబాబ్వే తమ రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ క్రెగ్‌ ఎర్విన్‌ (43), మరుమా (41), సికిందర్‌ రజా (37) రాణించారు. నయీమ్‌ హసన్‌కు ఐదు, తైజుల్‌ ఇస్లాంకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ జోడి చెలరేగడంతో జింబాబ్వే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమైంది.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 560/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేయగా.. జింబాబ్వే 265 పరుగులు చేసింది. 19 ఏళ్ల స్పిన్నర్‌ నయీమ్‌ హసన్‌ మొత్తం 9 వికెట్లతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన సీనియర్ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

ఈ టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్‌ డబుల్‌ సెంచరీ ( 203 నాటౌట్‌) నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో రహీమ్‌ డబుల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. దాంతో తన టెస్టు కెరీర్‌లో మూడో డబుల్‌ సెంచరీ సాధించి ఆ దేశం తరఫున అత్యధిక సార్లు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనతను సవరించుకున్నాడు. బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో తమీమ్‌ ఇక్బాల్‌, షకీబుల్‌ హసన్‌లు మాత్రమే తలోసారి డబుల్‌ సెంచరీలు చేసారు. ముష్ఫికర్‌ మాత్రం మూడుసార్లు ఆ ఫీట్ అందుకున్నాడు.

బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కూడా ముష్పికర్‌ రహీమ్‌ పేరిటే ఉంది. 2018లో జింబాబ్వేపై ముష్ఫికర్‌ అజేయంగా 219 పరుగులు చేసాడు. ఇదే బంగ్లా తరఫున ఇప్పటికే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. ఆ తర్వాత షకిబుల్‌ ఉన్నాడు. 2017లో షకిబుల్‌ 217 పరుగుల్ని న్యూజిలాండ్‌పై సాధించాడు.

Story first published: Wednesday, February 26, 2020, 8:52 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X