న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతకుందు ఓ లెక్క.. గంగూలీ వచ్చాక మరోలెక్క: హుస్సేన్

Nasser Hussain explains how Sourav Ganguly changed Indian cricket

లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ప్రశంశల్లో ముంచెత్తాడు. గంగూలీ టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చేశాడు అని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ స్థాయిని పెంచిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ విషయాన్ని అతడితో కలిసి ఆడిన ఆటగాళ్లతో పాటు మాజీలు కూడా ఒప్పుకుంటారు. 2000 నుంచి 2005 వరకు గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలు రాళ్లను చేరుకుంది. అప్పటి మేటి జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.

అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసింది సెహ్వాగ్ కాదు.. ఎవరో తెలుసా?!!అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసింది సెహ్వాగ్ కాదు.. ఎవరో తెలుసా?!!

గంగూలీ రాకముందు వేరేలా ఉండేది:

గంగూలీ రాకముందు వేరేలా ఉండేది:

ఇటీవల స్కై స్పోర్ట్స్‌తో పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నాజర్ హుస్సేన్ భారత క్రికెట్‌కు సౌరవ్ గంగూలీ కొత్త ఊపిరులూదాడన్నారు. గంగూలీకి ముందు భారత జట్టు చాలా సౌమ్యంగా ఉండేదని, అయితే గంగూలీ కెప్టెన్సీ చేపట్టిన తరువాత జట్టులో నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పాడు. 'గంగూలీ భారత క్రికెట్‌ను మార్చిన గొప్ప ఆటగాడు. ఆయన కారణంగా భారత క్రికెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. జట్టు సభ్యులను ఉద్రేకపూరితంగా మార్చడంలో దాదా సఫలీకృతుడయ్యాడు. 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో మ్యాచ్‌ గెలువగానే చొక్కా విప్పి గాల్లో తిప్పడం ఒక్క గంగూలీకే చెల్లింది' అని నాజర్ అన్నాడు.

లార్డ్స్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు:

లార్డ్స్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు:

'సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గాలిలో తిప్పుతూ వేడుక చేసుకున్న తీరు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సంఘటన తర్వాత గంగూలీ టెంపరితనం జట్టులో భాగమైపోయింది. అప్పటికి ఓ ఏడాది క్రితం ముంబైలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆండ్రు ఫ్లింటాఫ్ అదే తరహాలో షర్ట్ విప్పి వేడుక చేసుకున్నాడు. దానికి గంగూలీ లార్డ్స్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు' అని నాజర్ హుస్సేన్ తెలిపాడు. సునీల్‌ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్ ‌సింగ్‌, హర్బజన్ ‌సింగ్‌ అందరూ టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన వారేనన్నాడు.

అందుకు కోహ్లీ ఒప్పుకోడు:

అందుకు కోహ్లీ ఒప్పుకోడు:

'కెప్టెన్సీని షేర్‌ చేసుకోవడమనేది వ్యక్తి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా తన మాట నెగ్గాలనుకునే విరాట్ విరాట్‌.. మరొకరితో నాయకత్వ పగ్గాలు పంచుకోవడమనేది కష్టం. అతను ఎవరితోనూ అలాంటి బాధ్యతలు పంచుకునేందుకు ఇష్టపడడు' అని నాజర్ అన్నాడు. 'ఇంగ్లండ్‌ జట్టు విషయానికొస్తే ఇయాన్ మోర్గాన్‌, జో రూట్‌ రూపంలో ఇద్దరు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరికి ఎక్కడా కూడా అభిప్రాయబేధాలు లేవు. ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లాంటి జట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు' అని తెలిపాడు.

హుస్సేన్ సెంచరీ:

హుస్సేన్ సెంచరీ:

లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 325 ప‌రుగులు చేసింది. నాజర్ హుస్సేన్ సెంచరీ బాదాడు. అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో 146 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచుల్లో నిలిచింది. యువరాజ్, కైఫ్‌ ఆదుకోవడంలో భారత్ గెలుపుపై నమ్మకంగా ఉంది. ఈ క్రమంలో యువీ (69) పెవిలియన్ చేరాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్‌ బ్యాటింగ్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్‌ను టీమిండియాకు అందించాడు.

Story first published: Monday, May 18, 2020, 20:46 [IST]
Other articles published on May 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X