న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ టీనేజర్ నసీమ్‌ షా 'హ్యాట్రిక్‌'.. 17 ఏళ్లకే టెస్టు క్రికెట్‌లో ప్రపంచ రికార్డు!!

Naseem Shah’s maiden Test hat-trick against Bangladesh in Rawalpindi Test

రావల్పిండి: పాకిస్థాన్‌ టీనేజ్‌ పేసర్‌ నసీమ్‌ షా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు. అతి పిన్న వ‌య‌సులో హ్యాట్రిక్ తీసి ప్రపంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో నసీమ్‌ షా ఈ ఘ‌న‌త న‌మోదు చేశాడు. 16 ఏళ్ల 359 రోజుల వ‌య‌సులో ముగ్గురిని వ‌రుస బంతుల్లో పెవిలియ‌న్‌కు పంపి టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును తన పేరుపై లికించుకున్నాడు.

భారత బ్యాట్స్‌మన్‌ మీదకు బంతి విసిరిన బంగ్లా బౌలర్.. తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)!!భారత బ్యాట్స్‌మన్‌ మీదకు బంతి విసిరిన బంగ్లా బౌలర్.. తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)!!

 నసీమ్‌ షా 'హ్యాట్రిక్‌':

నసీమ్‌ షా 'హ్యాట్రిక్‌':

నజ్ముల్ హుస్సేన్ శాంటో, తైజుల్ ఇస్లాం, మహముదుల్లాను వరుస బంతుల్లో నసీమ్‌ షా పెవిలియ‌న్‌కు పంపాడు. ఆదివారం మూడో రోజు త‌న ఏడో ఓవ‌ర్‌లో న‌సీమ్ ఈ హ్యాట్రిక్ న‌మోదు చేశాడు. 17 ఏళ్లకు ఆరు రోజుల ముందు నసీమ్‌ ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. 16 ఏళ్ల 359 రోజుల్లో హ్యాట్రిక్‌ తీసిన నసీమ్‌.. బంగ్లాదేశ్‌కు చెందిన అలోక్‌ కపాలి రికార్డును బద్ధలు కొట్టాడు. 19 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్‌పైనే 2003లో కపాలి ఆ రికార్డు నెలకొల్పడం ఇక్కడ విశేషం.

పట్టు బిగించిన పాక్:

పట్టు బిగించిన పాక్:

నసీమ్‌ షా చెలరేగడంతో తొలి టెస్టులో పాక్ ప‌ట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 124/2తో పోరాడుతున్న దశలో నసీమ్‌ షా వరుసగా మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌ 126/6తో కష్టాల్లో కూరుకుపోయింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 126/6తో నిలిచింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 86 పరుగులు వెనుకంజలో ఉంది. బంగ్లా చేతిలో 4 వికెట్లే ఉన్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌ మోమినుల్‌ మక్‌ (37), లిటన్‌ దాస్‌ (0) క్రీజులో ఉన్నారు.

ఆజమ్‌ సెంచరీ:

ఆజమ్‌ సెంచరీ:

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 342/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాక్‌.. 445 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (143) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగ్గా.. హరీస్‌ సోహైల్‌ (75) రాణించాడు. బంగ్లా బౌలర్లలో అబు జయేద్‌, రూబెల్‌ హుసేన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసింది.

నాలుగో పాకిస్తాన్ బౌలర్:

నాలుగో పాకిస్తాన్ బౌలర్:

నసీమ్‌ టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన నాలుగో పాకిస్తాన్ బౌలర్ అయ్యాడు. ఈ ఎలైట్ జాబితాలో మొహమ్మద్ సమీ, అబ్దుల్ రజాక్, వసీం అక్రమ్ ఉన్నారు.నసీమ్‌ షా హ్యాట్రిక్‌కు సంబందించిన వీడియో మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు నసీమ్‌ షాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిన్న వయసులో అరుదైన ఘనత అందుకోవడం సూపర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Monday, February 10, 2020, 10:00 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X