న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ పేసర్ నసీమ్‌ షా అరుదైన రికార్డు!!

Naseem Shah became the youngest pace bowler to take five wickets in an innings

కరాచీ: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 263 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో 2009 ఉగ్రదాడి తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 1-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది. అంతేకాదు 2006 నుండి స్వదేశంలో పాకిస్తాన్ సాధించిన మొదటి సిరీస్ విజయం ఇది. పాకిస్తాన్‌ టీనేజ్‌ పేసర్ నసీమ్‌ షా చెలరేగడంతో రెండో టెస్టులో పాక్ సునాయాస విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. తొలి టెస్టుకు వరణుడు అడ్డుపడిన విషయం తెలిసిందే.

'వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా.. ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా: రోహిత్'వచ్చే ఏడాది కోసం ఎంతో ఎదురుచూస్తున్నా.. ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తా: రోహిత్

476 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నసీమ్‌ షా దెబ్బకు లంక బ్యాట్స్‌మన్‌ విలవిలలాడారు. లంక రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆదివారం ఆటలో చివరి బంతికి దిల్రువాన్‌ పెరీరా (5)ను ఔట్‌ చేసిన నసీమ్‌.. ఈ రోజు ఆటలో తొలి బంతికే లసిత్‌ ఎంబల్‌దెనియా (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో హ్యాట్రిక్‌ సాధించే అవకాశం నసీమ్‌కు వచ్చింది. అయితే విశ్వ ఫెర్నాండో హ్యాట్రిక్‌ సాధించే అవకాశం ఇవ్వలేదు. బంతిని డిఫెన్స్ చేసి అడ్డుపడ్డాడు.

ఆ తర్వాత ఓవర్‌లో ఫెర్నాండో (0)ను ఔట్‌ చేసి ఐదు వికెట్లను సీమ్‌ ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కుషాల్ మెండిస్ (0), దినేష్ చండీమల్ (2)లను ఔట్ చేసాడు. ఐదు వికెట్లు తీయడంతో నసీమ్‌ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాక్​ తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైతే.. శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ అజామ్‌, అసద్ షఫీక్, దినేష్ చండీమల్ హాఫ్ సెంచరీలు చేశారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌ను 555/3 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. షాన్‌ మసూద్‌, అబిద్‌ అలీ, అజహర్‌ అలీ, బాబర్‌ అజామ్‌లు సెంచరీలు చేశారు. లంక రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓషాడా ఫెర్నాండో సెంచరీ చేయగా.. నిరోషన్ డిక్వెల్లా హాఫ్ సెంచరీ చేసాడు.

Story first published: Monday, December 23, 2019, 13:48 [IST]
Other articles published on Dec 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X