న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సబర్మతి తీరంలో అద్భుతాన్ని చూసి స్టన్నయిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడే నేషనల్ గేమ్స్ ప్రారంభం

Narendra Modi Pleased With The Drone Show Arranged for His Visit to Inaguration of National Games

గుజరాత్‌లోని అహ్మదాబాద్లో 36వ నేషనల్ గేమ్స్ నిర్వహించబోతున్న సందర్భంగా అద్భుతమైన డ్రోన్ షోను క్రీడాధికారులు నిర్వహించారు. సబర్మతి నదీ తీరంలో నిర్వహించిన ఈ డ్రోన్ షో.. ఆద్యంతం అబ్బురపరిచింది. పెద్ద ఎత్తున జనాలు ఈ డ్రోన్ షో చూడడానికి వచ్చారు. ఆకాశాన డ్రోన్లతో అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రాలు.. అలాగే కొటేషన్లు ప్రదర్శించడం ఆకట్టుకుంది. ఇందుకు ఏకంగా 600 డ్రోన్లు వాడడం గమనార్హం.

వివిధ రంగుల్లో వివిధ రకాలుగా డ్రోన్లను ప్రయోగించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్టన్నయ్యారు. మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు రానున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా 36వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్నారు. ఆయన రాక సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్ కనబర్చేందుకు గుజరాత్ క్రీడాధికారులు స్పెషల్ అరెంజ్ మెంట్స్ చేశారు. ఇకపోతే మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.

ఆరు నగరాల్లో నిర్వహణ

భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంలో 36వ జాతీయ క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్రప్రభుత్వం తీసుకుంది. తద్వారా బహుళ-క్రీడా ఈవెంట్‌ను నిర్వహించడంలో కొంత ప్రత్యక్ష అనుభవం దక్కుతుందనే ఇంటెన్షన్. 2015 కేరళ ఎడిషన్, గోవా ఎడిషన్ రద్దయ్యాక.. ఏడు సంవత్సరాల తరువాత జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, సూరత్, భావ్‌నగర్, రాజ్‌కోట్ అనే ఆరు నగరాల్లో ఈ మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే ఈవెంట్లకు సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయి. మొత్తం 90రోజుల వ్యవధిలో ఈ గేమ్స్ జరగనున్నాయి.

స్టార్ ప్లేయర్లు మిస్

స్టార్ ప్లేయర్లు మిస్

మొత్తం 36యూనిట్ల (రాష్ట్రాలు, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్) నుంచి అథ్లెట్లు 35క్రీడలలో పోటీపడతారు. ఈసారి హ్యాండ్ బాల్ మిస్సయింది. మల్లఖంబ, యోగాసనాలు పోటీల్లో చేరాయి. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు లాంటి కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులు ఈ ఈవెంట్లో గాయాల కారణంగా పాల్గొనలేకపోతున్నారు. అయితే బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్వహించిన బిల్డ్ అప్ ఈవెంట్‌కు సింధు హాజరై ఉత్సాహపరిచింది. అయినప్పటికీ ఈ ఈవెంట్‌లో చాలా మంది స్పెషల్ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు.

గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబించేలా

గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబించేలా

శరత్ కమల్, మనిక బాత్రా వంటి అగ్రశ్రేణి పాడ్లర్లు ఇప్పటికే సూరత్‌లో పోటీపడనుండగా.. ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను, టాప్ బాక్సర్ శివ థాపా, స్విమ్మర్లు సజన్ ప్రకాష్, శ్రీహరి నటరాజ్, మాన పటేల్, ఆర్చర్స్ అతాను దాస్ తరుణ్‌దీప్ రాయ్ పోటీల్లో కన్పించబోనుండడం గమనార్హం. నవరాత్రుల పండుగ సీజన్‌తో పాటు ఈవెంట్‌ నిర్వహణ సమయంలో గుజరాత్‌లోని గొప్ప సంస్కృతిని అథ్లెట్లు అనుభవించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Story first published: Thursday, September 29, 2022, 9:54 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X