న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup Qualifier: టీ20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్ అర్హత.. తొలిసారి నమీబియా!!

ICC T20 World Cup 2020 : Scotland Clinch T20 World Cup Spot ! || Oneindia Telugu
Namibia to historic first T20 World Cup, Scotland clinch Australia berth after beating UAE

దుబాయ్‌: వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు స్కాట్లాండ్, నమీబియా జట్లు అర్హత సాధించాయి. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్‌ టోర్నీ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌ 90 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)పై ఘన విజయం సాధించింది. ఇక ఒమన్‌ను 54 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా నమీబియా ప్రపంచకప్‌కు బెర్త్ సాధించింది.

India vs Bangladesh: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌.. అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టిన రహానే!!India vs Bangladesh: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌.. అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టిన రహానే!!

ముందుగా బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. మున్సే (43 బంతుల్లో 65; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా.. బెరింగ్టన్‌ (18 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం యూఏఈ 18.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. రమీజ్‌ షహజాద్‌ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. వాట్, షరీఫ్‌ చెరో 3 వికెట్లు తీశారు. స్కాట్లాండ్‌ గతంలో 2007, 2009, 2016 టీ20 ప్రపంచకప్‌లలో ఆడింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును విలియమ్స్‌ (45, 41 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్‌ జేజే స్మిత్‌ (59; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌలర్లపై విరుచుకుపడటంతో నమీబియా 161 పరుగులు చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్‌ (4/19) రాణించాడు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్.. నమీబియా బౌలర్లు బెర్నార్డ్‌ (3/14), ఎరాస్మస్‌ (3/19) ధాటికి 107 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ బ్యాట్స్‌మన్‌లో ఓపెనర్ ఖావర్‌ అలీ (45) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. నమీబియాతో పాటు పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ కూడా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 18, 2019, 18:18 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X