న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉమర్ అక్మల్ మూర్చ రోగి.. అయినా సెలక్టర్లు పట్టించుకోలేదు: పీసీబీ మాజీ చైర్మన్‌

Najam Seth says Umar Akmal suffers from epilepsy, he was not willing to accept it

కరాచీ: గత సోమవారం అవినీతి ఆరోపణలపై మూడేళ్ల నిషేధానికి గురైన పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై పీసీబీ మాజీ చైర్మన్‌ నజామ్‌ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉమర్‌ ఒక మూర్చ రోగి అని మరో కొత్త వివాదానికి తెరలేపాడు. తాను పీసీబీ చైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ హెడ్‌గా ఉన్నసమయంలో తాను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్‌దేనని పేర్కొన్నాడు. 2013 నుంచి 2018 పీసీబీ చీఫ్‌గా ఉన్న సేతీ.. అక్మల్‌ మూర్చ రోగంకు వైద్యం తీసుకొనేందుకు నిరాకరించాడని చెప్పుకొచ్చాడు.

ఆకాశ్‌ చోప్రా వరల్డ్‌ ఎలెవన్‌లో బుమ్రాకు చోటు.. రోహిత్‌, కోహ్లీలకు షాక్!!ఆకాశ్‌ చోప్రా వరల్డ్‌ ఎలెవన్‌లో బుమ్రాకు చోటు.. రోహిత్‌, కోహ్లీలకు షాక్!!

ఉమర్ మూర్చ రోగి:

ఉమర్ మూర్చ రోగి:

ఇటీవల ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సేతీ మాట్లాడుతూ... 'పీసీబీ చైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ హెడ్‌గా ఉన్న సమయంలో నేను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్‌దే. ఉమర్‌కు మూర్చ ఉన్నట్లు అప‍్పటి మెడికల్‌ రిపోర్ట్‌ల్లో వెల్లడైంది. కానీ దానిని సెలక్షన్‌ కమిటీ సీరియస్‌గా తీసుకోలేదు. అతనికి మూర్చ ఉండటం వల్లే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తాను మూర్చ రోగిననే విషయాన్ని అంగీకరించడానికి ఉమర్‌ సిద్ధంగా లేడు' అని అన్నాడు.

సెలక్షన్‌ కమిటీ లైట్‌ తీసుకుంది:

సెలక్షన్‌ కమిటీ లైట్‌ తీసుకుంది:

'పీసీబీకి చేసిన సేవల్లో ఉమర్‌తో పెద్ద సమస్యగా ఉండేది. దాంతోనే రెండు నెలల పాటు అతన్ని క్రికెట్‌కు దూరంగా పెట్టా. ఆ తర్వాత సెలక్షన్‌ కమిటీ లైట్‌గా తీసుకోవడంతో క్రికెట్‌ను తిరిగి కొనసాగించాడు. సెలక్షన్‌ కమిటీ విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతోనే అప్పుడు మౌనంగా ఉండిపోయా. నిషేధం కారణంగా ఉమర్ కెరీర్‌ ముగిసిపోయినట్లే. నేను ఎప్పుడూ ఉమర్‌ కెరీర్‌ గురించి ఆందోళన చెందుతూనే ఉండేవాడిని. నియమావళిని అతిక్రమించడంతో అతని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. ఉమర్‌పై విధించిన మూడేళ్ల నిషేధంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే ప్రసక్తే లేదు' అని సేథీ అభిప్రాయపడ్డాడు.

ట్రైనర్‌తో దూకుడుగా వ్యవహరించిన ఉమర్‌:

ట్రైనర్‌తో దూకుడుగా వ్యవహరించిన ఉమర్‌:

తాజాగా ఉమర్‌ అక్మల్‌పై పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని విధించింది. బోర్డు నియమావళిలోని ఆర్టికల్‌ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో అతనిపై వేటు వేశారు. రెండు నెలలపాటు విచారించిన తర్వాత ఉమర్‌పై నిషేధమే సబబుగా భావించి పీసీబీ నిర్ణయం తీసుకుంది. పీఎస్‌ఎల్‌లో ఒక బుకీ తనను సంప్రదించాడనే విషయాన్ని దాచి పెట్టడంతోనే ఉమర్‌పై వేటుకు కారణమైంది. మరొకవైపు ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరైన క‍్రమంలో ట్రైనర్‌తో ఉమర్‌ దూకుడుగా వ్యవహరించాడనే అపవాదు కూడా ఉంది.

Story first published: Saturday, May 2, 2020, 13:27 [IST]
Other articles published on May 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X