న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా గుడ్ ఫ్రెండే.. గొప్ప కెప్టెన్ అని నమ్ముతున్నా!!

Virat Kohli A Good Friend Of Mine & A Great Captain : AB de Villiers
My Good Friend Virat Kohli Is A Great Captain, Says AB De Villiers

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అన్ని జట్ల కెప్టెన్‌ల కంటే అత్యుత్తముడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఇటీవల ప్రముఖ మీడియాతో మాట్లాడిన డివిలియర్స్ తన మిత్రుడైన కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు. కెప్టెన్‌గానే కాదు.. తనకు మంచి మిత్రుడిగానూ కోహ్లీ ఉంటాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

కోహ్లీతో 2011 నుంచి డివిలియర్స్‌కు సాన్నిహిత్యం

కోహ్లీతో 2011 నుంచి డివిలియర్స్‌కు సాన్నిహిత్యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (లీగ్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీతో 2011 నుంచి డివిలియర్స్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని క్రికెట్ కెప్టెన్‌ల కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే గొప్ప ఆటగాడని అన్నాడు. ప్రపంచంలో ఎంతోమంది మంచి కెప్టెన్‌లలో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫఫ్ డుప్లెసిస్ వంటివారు ఉన్నారన్నాడు.

వారందరి కంటే విరాట్ గొప్ప కెప్టెన్

వారందరి కంటే విరాట్ గొప్ప కెప్టెన్

వారందరి కంటే విరాట్ గొప్ప కెప్టెన్ అని డివిలియర్స్ ప్రస్తుతించాడు. మిస్టర్ 360గా ప్రసిద్ధిగాంచిన డివిలియర్స్ ఈ ఏడాది మేలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేశాడు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడతానని స్పష్టం చేశాడు.

నా పిల్లలతో కుటుంబంతో కాలం గడుపుతున్నా

నా పిల్లలతో కుటుంబంతో కాలం గడుపుతున్నా

రిటైర్‌మెంట్ తర్వాత ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నానని తెలిపాడు. ఇన్ని రోజులు క్రికెట్ ఆడి సంవత్సరానికి ఆరు నెలల పాటు మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాను. కానీ, ఇప్పుడు నా పిల్లలతో కుటుంబంతో కాలం గడుపుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశంలో ఆఖరి ప్రశ్నగా ప్రపంచ కప్ 2019ను ఎవరు గెలుస్తారనుకుంటున్నారనే ప్రశ్నకు బదులిచ్చారు.

కప్‌ను దక్షిణాఫ్రికా గెలుస్తోందని ఆశిస్తున్నా

కప్‌ను దక్షిణాఫ్రికా గెలుస్తోందని ఆశిస్తున్నా

ఈ సారి కప్ సమరంలో చాలా వరకూ జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి. వాటిలో టీమిండియా కూడా చాలా ఉత్తమమైన జట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. కానీ, ఈ సారి కప్‌ను దక్షిణాఫ్రికా సాధించగలదని ఆశిస్తున్నానని తెలిపాడు.

Story first published: Tuesday, October 23, 2018, 16:24 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X