గెలిచేశాం.. అంటూ బ్యాట్ పక్కన పడేసి నాగిని డ్యాన్స్

Posted By:
Mushfiqur Rahim celebrates Bangladesh’s win over Sri Lanka with ‘cobra’ dance on the pitch

హైదరాబాద్: విజయం వరకు వెళ్లి ఒకే ఒక్క పరుగు తీస్తే ఆ ఆనందం ఎంత ఉద్వేగంగా ఉంటుందో కదా.. అలానే శనివారం లంక వేదికగా జరగుతున్న ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్‌లో టీమిండియాను లంక ఓడించగా..రెండో మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ అలవోకగా గెలుపొందింది. ఓటమిని జీర్ణించుకోలేని బంగ్లాదేశ్ శనివారం ఆతిథ్య శ్రీలంక జట్టుపై అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

లంక నిర్దేశించిన 215 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్(72 నాటౌట్ 35 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్స్‌లు) అసాధారణ పోరాటంతో లంకపై 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. బెబ్బులిలా చెలరేగిన అతడు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు క్రీజులో నిలిచి లంకేయులకు షాక్ ఇచ్చాడు.


మైదానంలో ప్రతి ఆటగాడు తమదైన శైలిలో సంబరాలు చేసుకోవడం సాధారణమే. కానీ ముష్ఫికర్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ.. అంతుపట్టలేని ఆనందంలో నాగిని డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో నాలుగో బంతికి ఒక్క పరుగు తీయడంతో బంగ్లాదేశ్‌కు విజయం దక్కింది. ఆ పరుగు తీసిన ముష్‌ఫికర్ రహీమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే బ్యాట్ పక్కన పడేసి నాగిని చేశాడు.

Story first published: Sunday, March 11, 2018, 12:42 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి