న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్లో గొప్ప ఫీట్ సాధించిన ముష్ఫీకర్ రహీమ్.. బంగ్లాదేశ్ తరఫున తొలి ప్లేయర్

Mushfiqur Rahim became the first player to complete 5000runs for Bangladesh in Test cricket.

బంగ్లాదేశ్‌ జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ముష్ఫికర్ రహీమ్ రికార్డులకెక్కాడు. తోటి ప్లేయర్ తమీమ్ ఇక్బాల్‌ను అధిగమించిన ముష్ఫికర్ రహీమ్.. టెస్టుల్లో 5000పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇకపోతే 4481పరుగులతో తమీమ్ ఇక్బాల్ ఈ మైలురాయికి కేవలం 19పరుగుల దూరంలో ఉన్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తమీమ్ 133పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్లోకి వచ్చాడు. అతను రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అతను ఒక్క పరుగు కూడా చేయకుండానే కసున్ రజిత చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇకపోతే ముష్ఫీకర్ రహీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 105పరుగులు చేయడంతో అతను టెస్ట్ క్రికెట్లో 5037పరుగులు పూర్తి చేసుకున్నాడు.

5వేల పరుగుల మైలురాయి చేరడానికి ముష్ఫికర్ 149 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ వికెట్ కీపర్ కం బ్యాటర్.. 2005లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. షకీబ్ అల్ హసన్ తర్వాత అత్యంత పేరొందిన బంగ్లాదేశ్ ప్లేయర్‌గా ముష్ఫీకర్‌కు పేరుంది. అతను 2021లో జరిగిన ఐసీసీ వన్డే టీంలో ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ముష్ఫీకర్ ప్రాతినిధ్యం వహించిన మ్యాచ్‌ల్లో 150అంతర్జాతీయ మ్యాచ్‌లు బంగ్లాదేశ్ గెలిచింది. ఇక 2018లో జింబాబ్వేపై టెస్టులో అతను (219 నాటౌట్) పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.

అలాగే 2020 ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో.. ముష్ఫికర్ (203 నాటౌట్) పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన తొలి మరియు ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గా ముష్ఫీకర్ పేరుగాంచాడు. ప్రస్తుతం అతను వికెట్ కీపింగ్ పాత్రను అతని సహచరుడు లిట్టన్ దాస్‌కి అప్పగించాడు. ముష్ఫికర్ వికెట్ కీపర్‌గానూ ఎంతో ఆకట్టుకున్నాడు.

2017లో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో.. అతను వికెట్ కీపర్‌గా 100వ అవుట్‌ని నమోదు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున ఈ మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా పేరొందాడు. ఇకపోతే ముష్ఫికర్ 2011 నుండి 2017వరకు జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహించాడు. ఆ టైంలో బంగ్లాదేశ్ వన్డే ఫార్మాట్‌లో ఎంతో పురోగతిని సాధించింది. అతని సారథ్యంలో 2015 ప్రపంచ‌కప్‌లో బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. తదనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో బంగ్లాదేశ్ సిరీస్ వైట్‌వాష్ కావడంతో రహీమ్ విమర్శలకు గురయ్యాడు. తర్వాత అతను కెప్టెన్సీ కోల్పోయాడు.

Story first published: Thursday, May 19, 2022, 15:12 [IST]
Other articles published on May 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X