న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాకు క్రికెట్ ఆడటమే తెలుసు.. ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు'

Munaf Patel rubbishes allegations of sending death threat to Vadodara cricket chief Devendra Surti

న్యూఢిల్లీ: నాకు కేవలం క్రికెట్ ఆడటమే తెలుసు. నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు అని టీమిండియా మాజీ పేస్ బౌలర్, 2011 ప్రపంచ కప్ జట్టు సభ్యుడు మునాఫ్‌ పటేల్ స్పష్టం చేసాడు. విదర్భ క్రికెట్‌ చీఫ్‌ దేవేంద్ర సుర్తి తనను కావాలనే ఇరికిస్తున్నారని మునాఫ్‌ ఆరోపించాడు. బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ (బీసీఏ) క్రికెట్‌ జట్టుకు మునాఫ్‌ పటేల్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.

<strong>యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన బియాంక.. ఫైనల్లో సెరెనాతో ఢీ</strong>యూఎస్ ఓపెన్: చరిత్ర సృష్టించిన బియాంక.. ఫైనల్లో సెరెనాతో ఢీ

మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాలి:

మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాలి:

మునాఫ్‌ చంపుతానంటూ బెదిరించినట్లు దేవేంద్ర సుర్తి నవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా సిహెచ్‌ఎస్ తీసుకుంటున్న అవినీతి నిరోధక చర్యల కారణంగా.. మునాఫ్‌ తనను లక్ష్యంగా పెట్టుకున్నాడని, ఆ అవినీతి సహించలేక మునాఫ్‌ బెదిరింపులకు దిగాడని సుర్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒకవేళ తనకు, తన కుటుంబ సబ్యులకు ఏమైనా ప్రమాదం జరిగితే మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కేసు నమోదు:

కేసు నమోదు:

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నవపుర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాము దేవేంద్ర సుర్తి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, ఇప్పటివరకూ అయితే ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని నవపుర ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎమ్‌ చౌహాన్‌ తెలిపారు. అయితే మాజీ ఫాస్ట్ బౌలర్ తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు. ఈ విషయంపై తాజాగా మునాఫ్‌ స్పందించాడు.

 క్రికెట్‌ ఆడటమే తెలుసు:

క్రికెట్‌ ఆడటమే తెలుసు:

'అనవసరంగా నన్ను ఈ విషయంలోకి లాగుతున్నారు. ఎటువంటి కారణాలు లేకుండా నా పేరును తెరపైకి తెచ్చారు. నాకు తెలిసినంత వరకూ క్రికెట్‌ ఆడటమే తెలుసు. నా జీవితమంతా అలానే కొనసాగిస్తా. దేవేంద్ర సుర్తికి సెలక్షన్‌ కమిటీ సభ్యులతో ఇబ్బందులున్నాయి. నేను కేవలం బీసీఏ క్రికెట్‌ జట్టుకు మెంటార్‌ని మాత్రమే. నాకు సెలక్షన్స్‌తో ఎటువంటి సంబంధం ఉండదు' అని మునాఫ్ తెలిపాడు.

యాషెస్‌లో వరుసగా 500లకుపైగా పరుగులు.. రికార్డుల్లో స్మిత్!!

ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు:

ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు:

'ఎటువంటి కారణం లేకుండా నా పేరు ఈ విషయంలోకి లాగారు. ఇది అనవసరమైన రాద్ధాంతం. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు' అని మునాఫ్‌ పేర్కొన్నాడు. మునాఫ్‌ పటేల్‌ 2006లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసి 70 వన్డేలు, 13 టెస్టులు, 3 టీ20లు ఆడాడు. 201లో భారత్‌ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. మునాఫ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు.

Story first published: Friday, September 6, 2019, 17:26 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X