ఐపీఎల్‌లో ముంబై ఓపెనర్ల సరికొత్త రికార్డు

Posted By:
Mumbai Openers created a New Record: Scoring at 10 per over

హైదరాబాద్: సొంత మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు పరుగుల వరదపారించారు. అచ్చొచ్చిన మైదానంలో రన్‌రేట్ 10కి తగ్గకుండా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఈ మ్యాచ్‌లో పవర్‌ ప్లే ముగిసే సరికి ముంబై వికెట్ కోల్పోకుండా 84 పరుగులు చేసింది.

ముంబై Vs ఢిల్లీ లైవ్ స్కోరు కార్డు

పవర్‌ప్లే లో వచ్చిన ఈ 84 పరుగులు ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌కి అత్యధికం కావడం విశేషం. అంతేకాదు వాంఖ‌డే స్టేడియంలో ముంబై ఓపెన‌ర్లు 100 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడం కూడా ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్ (53) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఐపీఎల్ కెరీర్‌లో అతనికిది రెండో హాఫ్ సెంచరీ. మరో ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌లు (48) తృటిలో హాఫ్‌ సెంచరీని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో 3.2 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ని అందుకున్న ముంబై 8.3 ఓవర్లలో 100 పరుగులు చేయడం విశేషం.

టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి వెళ్లాడు. గత సీజన్ అంతా మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్.. ఈ సీజన్‌లో మళ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కలిపి రోహిత్ శర్మ 26 పరుగులు చేశాడు. దీంతో, ఈ మ్యాచ్‌లో మళ్లీ మిడిలార్డర్‌లోకి వెళ్లిన రోహిత్.. ఓపెనర్‌గా అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని పంపాడు.

ఈ క్రమంలో ముంబై ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఎవిన్ లూయిస్‌ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగుల వద్ద రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో రాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ముంబై ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో 3.2 ఓవర్లలో 50 పరుగుల మార్క్‌ని అందుకున్న ముంబై 8.3 ఓవర్లలో 100 పరుగులు చేయడం విశేషం.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్


ఎవిన్ లూయిస్ ఔటైన కొద్దిసేపటికే సూర్య కుమార్ యాదవ్‌()ని కూడా తెవాటియా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కీరన్ పొలార్డ్ (0), కెప్టెన్ రోహిత్ శర్మ (18) ఉసూరుమనిపించడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.

కృనాల్ పాండ్యా (11), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోరుకే పరిమితమం కావడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు 195 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 18:27 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి