న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విషాదం: గుండెపోటు రావడంతో మైదానంలో క్రికెటర్ మృతి

 Mumbai cricketer Vaibhav Kesarkar dies after suffering heart attack on field

హైదరాబాద్: మైదానంలోనే క్రికెటర్ ప్రాణాలు వదిలిన విషాద సంఘటన ముంబైలో ఆదివారం చోటు చేసుకుంది. వైభవ్ కేసర్కర్ అనే క్రికెటర్ గుండె పోటుతో మైదానంలోనే కుప్పకూలాడు. సెంట్రల్ ముంబైలోని బంధప్ రీజియన్‌లో టెన్నిస్ బంతితో స్థానిక క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మ్యాచ్ ఆడుతుండగానే కేసర్కర్ తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చినట్లు చెప్పాడు.

<strong>సమిష్టింగా రాణించాలి: బాక్సిండ్ డే టెస్ట్‌కు ముందు సహచరులతో కోహ్లీ</strong>సమిష్టింగా రాణించాలి: బాక్సిండ్ డే టెస్ట్‌కు ముందు సహచరులతో కోహ్లీ

అయితే, ఆ తర్వాత వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వైభవ్ కేసర్కర్ వయసు 24 ఏళ్లు. వైభవ్ కేసర్కర్ తీవ్రమైన ఛాతీ నొప్పి బాధిస్తున్నా.. అలాగే బ్యాటింగ్ కొనసాగించడం విశేషం. నొప్పి తీవ్రం కావడంతో అతడిని జట్టులోని సహచర ఆటగాళ్లు బలవంతంగా మైదానం నుంచి బయటకు తీసుకొచ్చారు.

ఈ మ్యాచ్‌ను ఓ యూట్యూబ్ చానెల్ లైవ్ టెలికాస్ట్ చేసింది. కేసర్కర్ తన ఛాతీని పట్టుకొని భారంగా ఫీల్డ్ వదిలి వెళ్లడం అందులో స్పష్టంగా కనిపించింది. గావోదేవి అనే జట్టుకు కేసర్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముంబై సర్కిల్స్‌లో కేసర్కర్‌కు మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్‌గా పేరుంది.

కేసర్కర్ హఠాన్మరణం ముంబై క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. నిరుపేద కుటుంబానికి చెందిన వైభవ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎనలేని ప్రేమ. స్థానిక క్రికెట్ టోర్నీల్లో కేసర్కర్ వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Story first published: Tuesday, December 25, 2018, 17:34 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X