చివరి 3 బంతుల్లో 3 వికెట్లు: కానీ హ్యాట్రిక్ మిస్సయ్యాడు ఎలా?

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

దీంతో ముంబైకి 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 20వ ఓవర్ చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ ఓవర్ వేసిన ముంబై బౌలర్ మెక్లెంగన్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. నాలుగో బంతికి పవన్ నేగి(35), ఐదో బంతికి జాదవ్(28)ను అవుట్ చేశాడు.

అయితే ఆఖరి బంతికి శ్రీనాథ్ అరవింద్(0)ను కీపర్ పార్థివ్ పటేల్ రనౌట్ చేశాడు. దీంతో మెక్లెంగన్‌ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు), మన్‌దీప్ సింగ్ (13 బంతుల్లో 17; 3 ఫోర్లు) నిలకడగా ఆడటంతో బెంగళూరు 3.3 ఓవర్లలోనే 31 పరుగులు చేసింది.

తొలి వికెట్‌గా విరాట్ కోహ్లీ

తొలి వికెట్‌గా విరాట్ కోహ్లీ

ఈ దశలో మన్‌దీప్ సింగ్‌‌ని స్పిన్నర్ క్రునాల్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత మరో 9 పరుగుల వ్యవధిలోనే మెక్లనగాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన అవుటయ్యాడు. కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సుల)తో చెలరేగాడు.

డివిలియర్స్‌కు చక్కటి సహకారం

డివిలియర్స్‌కు చక్కటి సహకారం

ముంబై స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు మరోసారి పరుగెత్తింది. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 12; 1x4) కూడా డివిలియర్స్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో మరోసారి క్రునాల్ పాండ్య బెంగళూరును తన బౌలింగ్‌తో దెబ్బతీశాడు.

3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేసిన డివిలియర్స్

3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేసిన డివిలియర్స్

11వ ఓవర్ మూడో బంతికి క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (12) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం 13వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ క్యాచ్ ఇచ్చి పెవివియన్‌కు చేరాడు. 27 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.

షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్

షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్

ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో 14వ ఓవర్ నాలుగో బంతికి షేన్ వాట్సన్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పవన్ నేగి (23 బంతుల్లో 35; ఒక ఫోర్, 3 సిక్సులు), కేదార్ జాదవ్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) రాణించడంతో బెంగళూరు 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో మెక్లనగాన్ మూడు వికెట్లు తీయగా.. క్రునాల్ పాండ్య రెండు, కర్ణ్ శర్మ, బుమ్రా చెరో వికెట్ తీశారు.

Story first published: Monday, May 1, 2017, 19:50 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి