న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న గారు ఉండుంటే ఎంతో గర్వపడేవారు.. టీమిండియాకు తొలిసారి ఎంపికైన ముఖేష్ కుమార్ భావోద్వేగం

Mukesh Kumar said that his late father would have been very proud if he had known that his Selection

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగాల్ పేసర్‌ ముఖేష్ కుమార్‌ తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఈ 28ఏళ్ల పేసర్ కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు సహచరులు కూడా ఫుల్‌గా ఖుషీ అవుతూ అతన్ని చీర్స్ చేశారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ప్లేయర్లతో కలిసి సౌరాష్ట్రలోని టీం హోటల్‌కి తిరిగి వెళుతుండగా.. ముఖేష్ కుమార్ జట్టుకు ఎంపికైన విషయం తెలిసి సహచరులు బస్సులో సంబరాలు జరిపారు. తన సహచరుల ప్రేమ, మద్దతు పట్ల ముఖేష్ ఉప్పొంగిపోయాడు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ ముఖేష్‌ను యమ చీర్స్ చేస్తూ ఉత్సాహపరిచాడు.

ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్లో అద్భుత ప్రదర్శన

ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్లో అద్భుత ప్రదర్శన

దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత 16మంది సభ్యుల జట్టులో ముఖేష్ ఎంపికయ్యాడు. ఈ బెంగాల్ పేసర్ ఇటీవల దేశీయ క్రికెట్‌లో అత్యంత స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను 31 ఫస్ట్‌క్లాస్ గేమ్‌లలో 113వికెట్లు తీసి సత్తా చాటాడు. అతను లిస్ట్ A క్రికెట్‌లో 18మ్యాచ్‌ల్లో 5.25 ఎకానమీ రేటుతో 17వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ Aతో జరిగిన మొదటి అనధికారిక టెస్ట్‌లో ఇండియా A తరపున 5వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇరానీ కప్‌లో 1వ రోజున 4వికెట్ల హాల్ సాధించి మెరిశాడు. ఇక అతని ప్రదర్శన చూసిన సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టలేకపోయారు. అందువల్ల అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇరానీ కప్‌లో అతను రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

తండ్రి ఆఖరి రోజుల్లో

తండ్రి ఆఖరి రోజుల్లో

తొలిసారి టీమిండియాకు ఎంపికవ్వడం పట్ల ముఖేష్ ఉద్వేగానికి లోనయ్యాడు. చనిపోయిన తన తండ్రి ఈ విషయం తెలిసి ఉంటే ఎంతో గర్వపడేవాడని గుర్తుచేసుకున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ముఖేష్ తండ్రి ఇటీవల మరణించారు. రంజీ ఫైనల్స్‌కు ముందు తండ్రి చనిపోవడంతో ముఖేష్ కుమిలిపోయాడు. తండ్రి ఆఖరి రోజుల్లో ఉదయం పూట శిక్షణ పొందుతూనే సాయంత్రం ఆసుపత్రిలో నాన్న గారి మంచం పక్కన పడుకుని సపర్యలు చేసేవాడు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన ముఖేష్.. తన సెలెక్షన్ సమయంలో తన తల్లి ఉద్వేగంతో ఎంత ఏడ్చిందో చెప్పుకుంటూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. మా ఇంట్లో అందరూ ఈ విషయం తెలిసి ఏడిచారు. ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత నాకు టీమిండియాకు ఆడే అవకాశం రావడంతో వాళ్లు తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోయారు. ముకేశ్ గ్రాడ్యుయేషన్ తర్వాత మూడుసార్లు CRPF పరీక్షలకు హాజరయ్యాడు.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

Story first published: Monday, October 3, 2022, 17:13 [IST]
Other articles published on Oct 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X