న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఆర్‌సీబీ ప్లేయర్‌కు ఇంకా టైముంది: ఎమ్మెస్కే ప్రసాద్

MSK Prasad predicts when Devdutt Padikkal will break into Indias Test team

హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌కు టీమిండియా పిలుపు అందుకోవడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని భారత మాజీ చీఫ్ సెలెక్టర్, ప్రముఖ తెలుగు కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాడు. అతను మరో ఏడాది దేశవాళీ క్రికెట్‌లో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ దుమ్ములేపాడు. అరంగేట్ర సీజన్‌లోనే ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సూపర్ సెంచరీతో సత్తా చాటాడు.

చాన్స్ దక్కకపోవడంపై..

చాన్స్ దక్కకపోవడంపై..

చక్కని బ్యాటింగ్​తో ఆకట్టుకుని, సెలక్టర్ల దృష్టిలోనూ పడ్డాడు. ఈ ఏడాది విజయ్​ హజారే ట్రోఫీలోనూ 700కు పైగా పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాట్స్​మన్​గా నిలిచాడు. జాతీయ జట్టులో చోటు కోసం అతను ఎంతగానో శ్రమిస్తున్నాడు. కానీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన 24 మందితో కూడిన జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఫామ్​లో ఉన్న అతడిని ఎందుకు తీసుకోలేదంటూ అభిమానులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పడిక్కల్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

మరో ఏడాది..

మరో ఏడాది..

అతన్ని జట్టులోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నాడు. 'దేవదత్ పటిక్కల్​ను టెస్టు ఫార్మాట్​లోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అతను జట్టులోకి వచ్చే ముందు మరింత బలంగా తయారవ్వాలి. ఇందుకోసం మరో ఏడాది పాటు దేశవాళీ క్రికెట్​ ఆడాల్సిన అవసరం ఉంది. అతనికి మంచి భవిష్యత్​ ఉంది. తప్పకుండా జట్టులోకి వస్తాడు" అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

గతేడాది 15 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 473 పరుగులు చేసిన పడిక్కల్.. అరంగేట్ర సీజన్‌లోనే 400కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది 6 మ్యాచ్‌లు ఆడిన అతను ఒక సెంచరీతో 195 రన్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ శతకం బాదాడు.

ప్రాక్టీస్ కోసం..

ప్రాక్టీస్ కోసం..

ప్రసిద్​ కృష్ణ, అవేశ్​ఖాన్​‌లు స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపికవ్వడంపై స్పందించిన ఎమ్మెస్కే.. వారు కూడా భవిష్యత్తులో జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. "భారత్​ ఏ జట్టులో ప్రసిద్​ కృష్ణ మంచి బౌలర్​. చాలా రోజులుగా బాగా ఆడుతున్నాడు. అవేశ్ ఖాన్​ కూడా ఐపీఎల్​లో 145-147కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. కాబట్టి ఇంగ్లండ్​లో టీమిండియాతో ప్రాక్టీస్​ చేయడానికి వీరి బౌలింగ్​ బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా వీరు భవిష్యత్​లో జట్టుకు ఆడతారు" అని ఎమ్మెస్కే ఆశాభావం వ్యక్తం చేశాడు.

జూన్‌ 18-22 మధ్య సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది. కాగా, సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. కానీ సీనియర్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు చైనామన్‌ బౌలర్ కుల్దీప్‌ యాదవ్‌పై వేటు పడింది.

Story first published: Monday, May 10, 2021, 13:07 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X