న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాస్ ఈజ్ బ్యాక్.. బ్యాట్‌పట్టిన ధోని.. రీ ఎంట్రీ కోసం ప్రాక్టీస్!

MS Dhoni Starts Practicing With Jharkhand Ranji Team After Out From BCCI Contract List || Oneindia
MS Dhoni starts practicing with Jharkhand Ranji squad after omission from BCCI contract list

రాంచీ : వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం దాదాపు 6 నెలలు క్రికెట్‌కు దూరమైన టీమిండియా సీనియర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. బీసీసీఐ కాంట్రాక్టులో చోటు కల్పించలేదని అతని అభిమానులు బీసీసీఐ గగ్గోలు పెడుతుంటే.. ధోని మాత్రం ఇవన్నీపట్టనట్లు రీ ఎంట్రీ కోసం సన్నాహకాలను ప్రారంభించాడు. పైగా రూ. 5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే మైదానంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్‌ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.

ఐపీఎల్‌లో రీ ఎంట్రీ..

ఐపీఎల్‌లో రీ ఎంట్రీ..

బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్‌ ట్రైనింగ్‌లో కూడా అతను పాల్గొన్నట్లు జార్ఖండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది.‘ధోని ప్రాక్టీస్‌లో పాల్గొంటాడని మాకు కూడా తెలియదు. మహీ రావడం మాకు సర్‌ప్రైజ్.కాసేపు బ్యాటింగ్ చేశాడు. అనంతరం రెగ్యూలర్ ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు. ధోని మాతో ట్రైనింగ్‌ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం.'అని తెలిపారు. ఇక ప్రత్యేక బౌలింగ్‌ మెషీన్‌ ద్వారా ధోని సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్‌ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా పోటీ క్రికెట్‌ కోసం తాను సిద్ధమవుతున్నట్లు ఈ జార్ఖండ్ డైనమైట్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. అయితే ఐపీఎల్‌ కోసమే అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సెకండ్ వన్డే ప్రివ్యూ.. రాజ్ కోట్‌లో రాత మారెనా

నో కాంట్రాక్ట్..

నో కాంట్రాక్ట్..

ఇక గురువారం బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టులో ధోనికి చోటుదక్కలేదన్న విషయం తెలిసిందే. గతేడాది ఎ గ్రేడ్‌లో ఉన్న ఈ మిస్టర్ కూల్‌కు ఈ సారి ఎలాంటి గ్రేడ్ దక్కలేదు. దీంతో అతని కెరీర్ ముగిసినట్లేనని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఈ కాంట్రాక్టుల వ్యవహారం ధోని అభిమానులను నిరాశపరిచినా.. అతను మళ్లీ మైదనాంలోకి అడుగుపెట్టడం.. ప్రాక్టీస్ పాల్గోనడం మాత్రం సంతోషాన్నిస్తుంది. బీసీసీఐ కాంట్రాక్టుల ప్రకారం ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున వేతనం లభిస్తుంది.

టీ20 పవర్ ప్లేలో అత్యధిక స్కోరు: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

 ధోనికి ముందే చెప్పాం..

ధోనికి ముందే చెప్పాం..

ఇక కాంట్రాక్టుల విషయంపై ధోనితో చర్చించామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ‘బోర్డు అత్యున్నత అధికారి ఒకరు కాంట్రాక్ట్‌ విషయం గురించి ధోనితో మాట్లాడారు. తనకు అర్హత లేదు కాబట్టి తన పేరు పరిశీలించవద్దని అతనే చెప్పాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ అతను జట్టులోకి వస్తే కాంట్రాక్ట్‌ తిరిగి రావడం పెద్ద విషయం కాదు. ధోనిలాంటి దిగ్గజ ఆటగాడికి కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది' అని ఆ అధికారి వెల్లడించారు.

Story first published: Friday, January 17, 2020, 10:34 [IST]
Other articles published on Jan 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X