న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 పవర్ ప్లేలో అత్యధిక స్కోరు: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

Ireland Smash The Highest Power Play Score in T20I History

హైదరాబాద్: వన్డే సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్ చెలరేగి ఆడింది. ఫలితంగా టీ20 చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అదే సమయంలో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

ఫలితంగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ జట్టుకు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రెయిన్‌లు తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం ఐరిష్ జట్టు ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం.

గంగూలీ లేకుంటే నా స్నేహితుల మాదిరి కెనడాలో స్థిరపడేవాడిని: హర్భజన్గంగూలీ లేకుంటే నా స్నేహితుల మాదిరి కెనడాలో స్థిరపడేవాడిని: హర్భజన్

పవర్ ప్లేలో 93 పరుగులు

అలాగే వీరిద్దరూ పవర్ ప్లేలో ఆరు ఓవర్లకు గాను 93 పరుగులు రాబట్టారు. దీంతో టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు రాబట్టిన జోడీగా సరికొత్త రికార్డు సృష్టించారు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన పాల్ స్టిర్లింగ్ మరింత దూకుడుగా ఆడే క్రమంలో సెంచరీ ముంగిట విండిస్ బౌలర్ హెడెన్ వాల్ష్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

47 బంతుల్లో 95

29 ఏళ్ల పాల్ స్టిర్లింగ్ 47 బంతుల్లో 8 సిక్సుల సాయంతో 95 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కెవిన్ ఓబ్రెయిన్‌ కూడా చెలరేగి ఆడటంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి పునరాగమనం చేసిన డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.

టాప్ స్కోరర్‌గా ఎవిన్ లూయిస్

అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టులో ఎవిన్ లూయిస్(53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో ఆఖర్లో వెస్టిండిస్ విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. అదే సరైన సమయంలో ఐరిష్ బౌలర్లు నికోలస్ పూరన్‌ను ఔట్ చేశారు.

4 పరుగుల తేడాతో విండిస్ ఓటమి

అయితే, ఆఖరి ఓవర్‌లో డ్వేన్ బ్రావో సిక్స్ బాదడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. అయితే డ్వేన్ బ్రావో, రూథర్‌ఫర్డ్ వికెట్లను కోల్పోవడంతో ఐర్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఈ సిరిస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 18న జరగనుంది.

Story first published: Thursday, January 16, 2020, 13:23 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X