న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వామ్మో.. నేను రానంటూ సిగ్గుపడిన ధోని ( ఫన్నీ వీడియో)

#WatchVideo : MS Dhoni Hilariously Runs Away From Stage After Singer Invites Him To Sing !
MS Dhoni shies away after singer Armaan Malik invites him on stage, funny video goes viral

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం క్రికెట్‌‌కు దూరమైన ధోని ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. అలాగే కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ కార్యక్రమానికి సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి హాజరైన ధోని.. స్టేజ్ ఎక్కడానికి సిగ్గుపడ్డాడు.

సిగ్గుతో పరుగెత్తిన ధోని..
త‌న బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోని ఓ పాట‌ను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. పాడుతూనే ధోనిని స్టేజ్ పైకి రావాల‌ని సూచించాడు. రెండు అడుగులు వేసిన ధోనీ.. సిగ్గు ప‌డుతూ. 'వామ్మో నేను రాను బాబు' అంటూ వెన‌క్కి త‌గ్గి దూరంగా వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత పాట‌లేం పాడించ‌నంటూ మాలిక్ హామీ ఇవ్వడంతో ధోని.. సాక్షితో క‌లిసి స్టేజ్‌పైకి వచ్చాడు. మాలిక్ పాడిన పాట‌ను ఆస్వాదిస్తూ చ‌ప్ప‌ట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోష‌ల్ మీడియాలో తాజాగా ఈ వీడియోను పోస్టు చేయ‌గా.. వైర‌లైంది. అభిమానులు లైకులు, కామెంట్ల‌తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని సింప్లిసిటీని కొనియాడుతున్నారు.

ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఈ జార్ఖండ్ డైనమైట్‌కు భారత క్రికెట్‌లో విశిష్ట స్థానం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. 2007 టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌తోపాటు ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని ధోని కెప్టెన్సీలోనే భార‌త్ నెగ్గింది. ఎల్ల‌ప్పుడూ డౌన్ టూ ఎర్త్‌గా ఉండే ధోని అంటే అభిమానుల‌కు చెప్ప‌లేనంత ఇష్టం. ఇక ధోని రీ ఎంట్రీ కోసం అతని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ లెజండరీ కెప్టెన్ మాత్రం తన భవితవ్యంపై స్పష్టత ఇవ్వడం లేదు.

రాహుల్‌కు అప్పుడు తిట్లు.. ఇప్పుడు ప్రశంసలు..రాహుల్‌కు అప్పుడు తిట్లు.. ఇప్పుడు ప్రశంసలు..

ఐపీఎల్‌తో క్లారిటీ..
ఇక అప్‌కమింగ్ ఐపీఎల్‌తోనే ధోని భవిష్యత్తు తెలుస్తుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపిన‌ విషయం తెలిసిందే. 'ఐపీఎల్-13 సీజన్ ధోనీకి ఎంతో కీలకం. ఈ విషయం సెలెక్టర్లు, కెప్టెన్‌తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. మహీ తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు. అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేం. ఐపీఎల్‌కు సంబంధించి ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో తెలియదు. కానీ.. ఐపీఎల్‌లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనతోనే మహీ భవితవ్యం తేలనుంది. ఒకవేళ ఐపీఎల్‌లో తన ఆటతో మెప్పించలేకపోతే ధోనీనే తప్పుకుంటాడు' అని న్యూజిలాండ్‌తో తొలి టీ20 విజయానంతరం రవిశాస్త్రి తెలిపాడు.

ఇంకొక్కటి చేస్తే ఎవరికి దక్కని రికార్డు రాహుల్ సొంతంఇంకొక్కటి చేస్తే ఎవరికి దక్కని రికార్డు రాహుల్ సొంతం

రంజీ జట్టుతో ప్రాక్టీస్‌:
బీసీసీఐ తనను కాంట్రాక్ట్‌ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోనీ ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి మైదానంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రంజీ జట్టుతో కలిసిన ధోనీ వైట్‌బాల్‌తో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు. ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ దేవాలయం 'డియోరి'లో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ ఐపీఎల్‌ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టినట్లు ప్రచారం కూడా జరిగింది.

Story first published: Tuesday, January 28, 2020, 21:37 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X