న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand, 3rd T20I: ధోని ఖాతాలో అరుదైన రికార్డు

MS Dhoni set to achieve another milestone as India gear up to take on New Zealand in 3rd T20I

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ధోనికి మొత్తంగా 300వ టీ20 కాగా.. ఈ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా ధోని నిలిచాడు.

Women 3rd T20I: పోరాడి ఓడిన భారత్, క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్Women 3rd T20I: పోరాడి ఓడిన భారత్, క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్

భారత్‌ తరఫున 96 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ధోని.. భారత క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ల్లో 175, ఛాంపియన్స్‌ టీ20 లీగ్‌లో 24, జార్ఖండ్‌ తరఫున 4, ఫస్ట్‌ క్లాస్‌ టీ20లో 1 మ్యాచ్‌తో కలిపి మొత్తం 300 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో 300 టీ20లాడిన ఆటగాళ్ల జాబితాలో ధోని చేరాడు.

ఈ జాబితాలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ 446 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్‌గేల్‌, డ్వేన్‌ బ్రేవో, షోయబ్‌ మాలిక్‌లు ధోని కంటే ముందంజలో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రైజింగ్‌ పుణె జట్లకు ధోని ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ 298, సురేశ్‌ రైనా 296 మ్యాచ్‌లతో ధోని తర్వాతి స్థానంలో ఉన్నారు. ధోని ఘనతపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో ధోని అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Story first published: Sunday, February 10, 2019, 14:07 [IST]
Other articles published on Feb 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X