ఓవర్లో 6 సార్లు డైవ్ చేయమన్నా.. సిద్ధమే: కోహ్లీ


హైదరాబాద్: రెండ్రోజుల ముందు ముగిసిన వెస్టిండీస్‌తో వన్డేలో కోహ్లీ పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. దేశం తరఫున ఆడడం ఎవరి కోసమో కష్టపడుతున్నట్లు కాదని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. పదేళ్ల నుంచి జట్టుకు ఆడుతున్నా ఏదీ కూడా తన సొంతమని భావించనని, దేనిపైనా తనకు హక్కులు ఉన్నట్లుగా భావించనని తెలిపాడు.

ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే
దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. పదేళ్లుగా ఆడుతున్నా. అయినా ఫలానాది నాదే, నాకే చెందుతుంది అనే భావన నాకెప్పుడూ కలగదు. ఇప్పటికీ నేను ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే. దేశానికి ఆడాలని ఎంతో మంది ఎంతగానో తపిస్తారు. కాబట్టి.. ఆడే అవకాశం దొరికిన ఆటగాడు కసితో ఆడాలి. ఇక మనకేం ఢోకా లేదు అనుకోవద్దు. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దు.
7 నెలల్లో వరల్డ్ కప్.. కుదురుకోని టీమిండియా మిడిలార్డర్

ఎంత శ్రమించడానికైనా తాను సిద్ధమేనని
జట్టు అవసరాల కోసం ఎంత శ్రమించడానికైనా తాను సిద్ధమేనని అన్నాడు. దేశానికి ఆడేటప్పుడు ఏ దశలోనూ తీవ్రత తగ్గించకూడదని అన్నాడు. జట్టు అవసరాలకు పెద్ద పీట వేయడం వల్లే తాను మైలురాళ్లను అందుకోగలుగుతున్నానని కోహ్లి చెప్పాడు. ఇన్నేళ్లు దేశానికి ఆడగలిగినందుకు సంతోషపడుతున్నానే కానీ మైలురాళ్ల గురించి పట్టించుకోనని చెప్పాడు.

ఓవర్లో ఆరుసార్లు డైవ్ చేయాల్సి వస్తే చేస్తా
ఓవర్లో ఆరుసార్లు డైవ్ చేయాల్సి వస్తే చేస్తా. అది జట్టు కోసం చేస్తా. ఎందుకంటే అది నా విధి. అందుకే నన్ను దేశం తరఫున ఆడేందుకు ఎంపిక చేశారు. అది విధుల్లో భాగం. ఎవరి కోసమో నేను కష్టపడట్లేదు. నా అంకితభావాన్ని ప్రదర్శించడానికి కూడా అలా చేయట్లేదు. జట్టు కోసమే అదంతా. ఆడేటప్పుడు శ్రద్ధంతా ఆటపైనే ఉండాలి.
ఆ ప్రక్రియలో మరిన్ని పరుగులు
జట్టు అవసరాలపై దృష్టిపెట్టడం ద్వారా నా శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా. ఆ ప్రక్రియలో మరిన్ని పరుగులు వస్తున్నాయి. అలా కాకుండా నా బ్యాటింగ్ గురించే ఆలోచిస్తే అన్ని పరుగులు చేసేవాణ్ని కాదు.

దీర్ఘకాలంగా ఆడుతున్నానని చెప్పడానికి ఓ నిదర్శనం
10 వేల పరుగుల మైలురాయి గురించి మాట్లాడుతూ.. బయటి నుంచి చూస్తే ఇలాంటివన్నీ గొప్పగా అనిపిస్తాయి. కానీ నా దృష్టంతా పక్రియపైనేనని.. ఫలితంపై కాదని నాకు తెలుసని చెప్పాడు. 10 వేల మైలు రాయి తాను దీర్ఘకాలంగా ఆడుతున్నానని చెప్పడానికి ఓ నిదర్శనం మాత్రమేనని, అంతకుమించి ఇంకేమీ లేదని కోహ్లి తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications