న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ న్యూలుక్‌పై నెటిజన్ల ఆసక్తి.. గూగుల్‌లో ఒకటే వెతుకులాట!

MS Dhoni new beard look in Ipl 2020

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ మొదలైంది. ఫ్యాన్స్​ సందడి లేకపోయినా.. చీర్​ గాళ్స్​​ వంపు సొంపుల వయ్యారాలు కనిపించకపోయినా.. బాదుడుకు మాత్రం కొదువలేదన్నట్లుగా సందడి చేసేందుకు మనముందుకు వచ్చింది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబి వేదికగా ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.

అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ న్యూలుక్‌తో కనిపించాడు. అచ్చం ’సింగం' సినిమాలో సూర్య స్టైల్‌లో ధోనీ లుక్ ఉంది. దీంతో ధోనీ న్యూలుక్‌పై నెటిజన్లు ఆసక్తికనబరుస్తున్నారు. అంతటితో ఆగకుండా గూగులమ్మను అడుగుతున్నారు. అతని గడ్డంతో ఉన్న ఫొటోల కోసం వెతుకుతున్నారు. ధోనీ బియర్డ్ లుక్, ధోనీ బియర్డ్ స్టైల్, ధోనీ న్యూలుక్, ధోనీ న్యూలుక్ 2020 కీవర్డ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు. అలాగే ధోనీ లెటేస్ట్ పిక్, ధోనీ హెయిర్ ట్రాన్స్‌ప్లెంట్ గురించి కూడా వెతుకుతున్నారు.

MS Dhoni new beard look in Ipl 2020

గత ఏడాదిగా ఆటకు దూరమైన మహీ.. మళ్లీ ఈ ఐపీఎల్ మ్యాచ్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టాడు. దీంతో ధోనీ రాక కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లతో ఎదురుచూసింది. పైగా గత నెల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఈ మ్యాచ్ అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది. ఇక మ్యాచ్‌కు ముందు 'అంతర్జాతీయ క్రికెట్‌కు 19.29కు వీడ్కోలు పలికిన నీవు.. 19.30కి రీఎంట్రీ ఇవ్వడం బాగుంది. చూడ ముచ్చటగా ఉంది'అనే మీమ్స్, ట్వీట్స్‌‌తో #WelcomeBackDhoni అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక ఫస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ.. ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌కు దిగింది.

ధాటిగానే ప్రారంభించిన ఆ జట్టు ధోనీ వ్యూహానికి బలైంది. ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ(12), క్వింటన్ డికాక్(33) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం సౌరభ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడారు. ఈ క్రమంలో చాహర్ బౌలింగ్‌లో సూర్యకుమార్(17)క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లకు 105 పరుగులు చేసింది. క్రీజులో సౌరభ్ తివారీ(27), హార్దిక్ పాండ్యా(12) ఉన్నారు.

భౌతిక దూరం రూల్ నేపథ్యంలో ఫస్ట్ స్లిప్ పెట్టుకోవచ్చా..? జోక్ చేసిన ధోనీ!భౌతిక దూరం రూల్ నేపథ్యంలో ఫస్ట్ స్లిప్ పెట్టుకోవచ్చా..? జోక్ చేసిన ధోనీ!

Story first published: Sunday, September 20, 2020, 14:17 [IST]
Other articles published on Sep 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X