న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త వారికి నో ఛాన్స్: 'పాక్ జట్టుతో పాటు బోర్డుపై కూడా కఠిన చర్యలు'

Imran Khan should take action against Pakistan cricket team: Kamran Akmal tells his PM

హైదరాబాద్: భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఆ జట్టు మాజీ వెటరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించాడు. ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16(ఆదివారం) మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ఓటమితో పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నెటిజన్లు అయితే, పాక్ జట్టులోని ఆటగాళ్లను అసభ్య పదాలతో దూషించారు కూడా. తాజాగా కమ్రాన్ ఆక్మల్ 'ది నేషన్' అనే ఇంగ్లీషు పత్రికతో మాట్లాడాడు.

చేధనకు దిగిన ఏ మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు

చేధనకు దిగిన ఏ మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు

"ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేధనకు దిగిన ఏ మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. పాకిస్థాన్ విజయం సాధించిన ఏకైక మ్యాచ్ ఆతిథ్య జట్టు ఇంగ్లాండపైనే. అది కూడా తొలుత బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డుపై 300కుపైగా స్కోరు ఉంచిన కారణంగా. ఇక, విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులకే కుప్పకూలింది" అని అక్మల్ మండిపడ్డాడు.

కఠిన చర్యలు తీసుకోండి

కఠిన చర్యలు తీసుకోండి

"పాకిస్థాన్ క్రికెట్‌కు డామేజ్ కలిగించిన పాకిస్థాన్ జట్టుతో పాటు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను నేను కోరుతున్నాను. మన దేశంలో ఎంతో మంది అద్భుత క్రికెటర్లు ఉన్నారు. వారందరినీ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తే పాక్ జట్టు అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అత్యధిక స్థాయికి చేరుకుంటుంది" అని వివరించాడు.

ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలను సైతం

ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలను సైతం

ఇదిలా ఉంటే, భారత్-పాక్ మ్యాచ్‌కి ముందు ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలను సైతం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పట్టించుకోక పోవడం విశేషం. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాల‌ని ఇమ్రాన్ ఖాన్ త‌మ దేశ క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు సూచించారు. తొలుత బ్యాటింగ్ చేయ‌డం వల్ల భారీ స్కోరును చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు.

ఇమ్రాన్ ఖాన్ సూచ‌న‌ల‌కు భిన్నంగా

ఇమ్రాన్ ఖాన్ సూచ‌న‌ల‌కు భిన్నంగా

మాంఛెస్ట‌ర్‌లో నెల‌కొన్న వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి చూస్తే.. ఛేజింగ్ జ‌ట్టుకు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కాలం గ‌డిచే కొద్దీ పిచ్‌పై తేమ శాతం పెరుగుతుందని, దీన్ని ఆధారంగా చేసుకుని మ‌హమ్మ‌ద్ అమీర్ వంటి బౌల‌ర్లు చెల‌రేగిపోవ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు ఇమ్రాన్ ఖాన్‌. అయితే, ఇమ్రాన్ ఖాన్ సూచ‌న‌ల‌కు భిన్నంగా టాస్ గెలిచినా సర్ఫరాజ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

జట్టులో విభేదాలు, కెప్టెన్‌తో సత్సంబంధాలు లేకపోవడమే

జట్టులో విభేదాలు, కెప్టెన్‌తో సత్సంబంధాలు లేకపోవడమే

అయితే, జట్టులో విభేదాలు, కెప్టెన్‌తో సత్సంబంధాలు లేకపోవడమే ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలని అక్కడి మీడియా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆదివారంనాటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం కెప్టెన్‌ సర్ఫరాజ్‌ డ్రెస్సింగ్‌ రూంలో తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఇమద్‌ వాసిం, ఇమాముల్‌ హక్‌ తనతో సహకరించడం లేదని, పరాజయానికి వారే కారణమని పేర్కొన్నట్టు సామ వార్తా చానల్‌ పేర్కొన్నది.

జూన్ 23న దక్షిణాఫ్రికాతో తలపడనున్న పాక్

జూన్ 23న దక్షిణాఫ్రికాతో తలపడనున్న పాక్

మరో స్థానిక ఛానెల్ పాక్ జట్టులో గ్రూపులు ఉన్నాయని పేర్కొంటూ కథనాన్ని ప్రసారం చేసింది. ఇక, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్‌ ఖాన్‌ జట్టులో సమస్యలు ఉన్నాయని కొందరు ఆటగాళ్లు తనతో చెప్పారని ఆ సమస్యపై దృష్టి సారించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హితబోధ చేశాడు. ఇదిలా ఉంటే, పాక్‌ జూన్ 23న దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Friday, June 21, 2019, 14:33 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X