న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ మిల్లర్ సరికొత్త రికార్డు: కొట్టడమే కాదు.. పట్టడంలో కూడా ఘనుడే

Most T20I catches: David Miller took the 50th catch of his career, equals Shoaib Malik world record

బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా మిల్లర్‌ పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ సరసన చేరాడు.

జాగ్రత్త.. తొలి మ్యాచ్ కోసం భారత్‌కు వస్తా: ట్రంప్జాగ్రత్త.. తొలి మ్యాచ్ కోసం భారత్‌కు వస్తా: ట్రంప్

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కాగిసో రబాడ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఇదో బంతిని హార్దిక్ పాండ్యా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్‌ మిల్లర్‌ క్యాచ్‌ను అందుకోవడంతో పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్‌ను మిల్లర్‌ అందుకోవడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా మాలిక్‌ సరసన చేరాడు. ఇప్పటివరకు మాలిక్‌ 50 క్యాచ్‌లు అందుకోగా.. తాజాగా హార్దిక్‌ కూడా 50 క్యాచ్‌లు అందుకున్నాడు.

షోయబ్‌ మాలిక్‌ 111 టీ20ల్లో 50 క్యాచ్‌లు అందుకోగా.. మిల్లర్‌ కేవలం 72 మ్యాచ్‌ల్లోనే 50 క్యాచ్‌లు అందుకోవడం విశేషం. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో మిల్లర్‌, మాలిక్‌లు ఉండగా.. డివిలియర్స్‌ (44), రాస్‌ టేలర్‌ (44), సురేశ్‌ రైనా (42) వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం మాలిక్‌ జట్టులోకి రావడం కష్టంగా మారిన నేపథ్యంలో మిల్లర్‌ మొదటి స్థానంలోకి దూసుకెళ్లనున్నాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. శిఖర్‌ ధావన్‌ (36) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదినుంచే భారత బౌలర్లపై విరుచుకుపడింది. కెప్టెన్ డికాక్‌ (79 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉంది సునాయసంగా విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ప్రొటీస్ మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

Story first published: Monday, September 23, 2019, 12:12 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X