న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ దేశీవాళీల్లో ఆడితేనే టీమిండియాలోకి తీసుకోవాలి'

MS Dhoni Should Play Domestic Cricket For India Selection | Oneindia Telugu
Mohinder Amarnath wants MS Dhoni to play domestic cricket to make himself eligible for India selection

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ తప్పక ఆడాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. ధోనీ విషయంలో కలుగజేసుకోగా తాజాగా మాజీ ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ కూడా చేరిపోయాడు. టీమిండియాకు ఆడాలంటే దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగాలంటూ మొహిందర్‌ అమర్‌నాథ్‌ సూచించాడు. టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనికి టీ20 జట్టులో చోటు దక్కలేదు.

టీ20 ఫార్మాట్‌కు ఎంపికచేయకపోవడం

టీ20 ఫార్మాట్‌కు ఎంపికచేయకపోవడం

ప్రస్తుతం అతడు వన్డే జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చేనెలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో ధోని పాల్గొనకపోవడంపై అమర్‌నాథ్‌ స్పందించాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ధోనీతోపాటు ఇతర సీనియర్‌ క్రికెటర్లు దేశవాళీ పోటీల్లో తప్పకుండా ఆడాలని భారత్‌ మాజీ ఆల్‌రౌండర్‌, సెలెక్టర్‌ మొహిందర్‌ అమర్‌నాథ్‌ అన్నాడు. టెస్ట్‌లకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన ధోనీని ఇటీవల టీ-20 జట్టుకు ఎంపికచేయని సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019: రూ. 2కోట్ల కనీస ధరలో ఒక్క భారత క్రికెటర్ లేడు!

ధావన్‌తో పాటుగా పక్కకు పెట్టి

ధావన్‌తో పాటుగా పక్కకు పెట్టి

టీమిండియాకు ఆడాలంటే ప్రతి ఒక్కరూ తమ రాష్ట్ర జట్టు తరఫున బరిలో దిగాలి. అందుకు తగ్గట్లు ప్రస్తుతమున్న పాలసీని బీసీసీఐ మార్చాల్సిన అవసరముంది. దేశవాళీ టోర్నీలు ఆడటాన్ని బోర్డు ఓ అర్హతగా మార్చాలి. జాతీయ జట్టుకు నీవు గతంలో ఏం సాధించావనేది కాదు. ఫామ్‌లేమితో నానా అవస్థలు పడుతున్న ధోనీని ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచి సెలెక్షన్ కమిటీ పక్కకు పెట్టగా, ధావన్‌ను టెస్ట్‌ల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అమర్‌నాథ్ మాట్లాడుతూ ఒక్కో ఆటగానిది ఒక్కో శైలి. ఎవరి ప్రతిభ వారిదే.

బీసీసీఐ పాలసీ మార్చాల్సిన అవసరం

బీసీసీఐ పాలసీ మార్చాల్సిన అవసరం

‘ప్రస్తుత ఫామే. ఏదో కొన్ని మ్యాచ్‌లకు పరిమితం గాకుండా రాష్ట్రం తరఫున రెగ్యూలర్‌గా మ్యాచ్‌లు ఆడాలి అని అన్నాడు. చాలామంది సీనియర్‌ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడట్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్నా.. దేశవాళీలో మాత్రం అన్ని ఫార్మాట్లలో బరిలో దిగాలి. అప్పుడే సెలెక్షన్స్‌కు పరిగణించాలి. ఒక్కో క్రికెటర్‌కు వ్యత్యాసముంటుంది. చాలామంది సీనియర్‌ ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడడంలేదు. అందువల్ల బీసీసీఐ తన విధానాలను మార్చాలి' అని అమర్‌నాథ్‌ తెలిపాడు.

Story first published: Thursday, December 13, 2018, 9:49 [IST]
Other articles published on Dec 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X