ఐపీఎల్ వేలం 2019: రూ. 2కోట్ల కనీస ధరలో ఒక్క భారత క్రికెటర్ లేడు!

న్యూఢిల్లీ: డిసెంబరు 18న నిర్వహించనున్న ఐపీఎల్ వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసింది. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. కానీ, ఇదే మొత్తంలో ఉన్న 9 మంది ప్లేయర్లు (బ్రెండన్ మెకల్లమ్, వోక్స్, లసిత్ మలింగ, షాన్ మార్ష్, కొలిన్ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, శ్యామ్ కరన్, డార్సీ షార్ట్) అంతా విదేశీయులే.

భారత ప్లేయర్ల అతి తక్కువ ప్రారంభ ధర
మరింత ఘోరంగా ధర తగ్గిన వారిలో రాజస్తాన్ రాయల్స్‌కు రూ.11.5 కోట్ల అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్ నిలిచాడు పేసర్ జైదేవ్ ఉన్‌దక్త్. ఈసారి రూ.కోటిన్నరకే వేలానికి వచ్చాడు. వెటరన్ డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్, స్పిన్నర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పేసర్ మొహమ్మద్ షమీ రూ.కోటికి, పేసర్ ఇషాంత్ శర్మ రూ.75 లక్షలకు, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి రూ.50 లక్షల ప్రాథమిక మొత్తానికి జాబితాలో ఉన్నారు.
నేనందుకే మనఃస్ఫూర్తిగా నవ్వలేనేమో: గంభీర్

రిజస్ట్రేషన్ చేసుకుంది మాత్రం 1003 మంది
కొద్ది రోజుల క్రిందటే ముగిసిన వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ప్లేయర్ రిజిస్ట్రేషన్‌లో మొత్తం 1003 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఇందులో మొత్తం 232 మంది విదేశీ ఆటగాళ్లున్నారని వారంతా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారని బీసీసీఐ పేర్కొంది. అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను మినహాయించి మిగిలిన వారి పేర్లను వేలానికి ముందే విడుదల చేసింది.

గరిష్ఠంగా 70 మంది ఆటగాళ్లను
ఈ నేపథ్యంలో 200 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు.. 800మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌తో పాటు ముగ్గురు అనుబంధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 800 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌లో 746 మంది ఆటగాళ్లు భారతీయులే కావడం విశేషం. ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

8 ఫ్రాంచైజీల వద్ద మొత్తంగా రూ. 145.25 కోట్లు
ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఈ వేలంలో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు మొత్తం 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications