షమీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు: భార్య హసిన్‌ జహాన్‌

Posted By:
Mohammad Shami left out of BCCI's central contract list
Mohammed Shami tried committing suicide, alleges wife Hasin Jahan

హైదరాబాద్: శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడంటూ మీడియాలో గగ్గోలు పెడుతూ.. తన ఆవేదన వ్యక్తం చేస్తుంది షమీ భార్య. ఈ ఆరోపణలు బుధవారం వెలుగులోకి రాగా షమీలో మరో కొత్త కోణం బయటికి వచ్చింది. అతను ఈ అక్రమ సంబంధాల విషయమై ఆత్మహత్యకు సైతం పాల్పడ్డాడట.

సాక్ష్యాధారాలతో సహా షమీ విషయాన్ని బయటపెట్టిన అతని భార్య పరాయి స్త్రీలతో పాటు ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి రచ్చకీడ్చింది. దాంతో పాటుగా షమీ ఎంజాయ్‌మెంట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కలిపి పోస్ట్ చేసింది. దీంతో పాటుగా ఒక పోస్టులో.. వారిద్దరి మధ్యా బాగా చనువుంది. అత్తయ్య సోదరి కుమార్తెతో ఒక ఐదేళ్లుగా బంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో తననే పెళ్లి చేసుకుంటానని ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడ్డాడు' అని పేర్కొంది.

'తనకేం కావాలంటే అది చేశాను. తనకు నచ్చలేదని నా మోడలింగ్ కెరీర్‌ను సైతం వదులుకోవాల్సి వచ్చింది. ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టొద్దంటూ పెట్టిన ఆంక్షలు సైతం భరించాను. తొలి నాళ్లలో పెళ్లి చేసుకోమని బతిమాలిన వాళ్లే.. చంపేయమంటున్నారని' తన అత్తమామల గురించి వివరించింది.

షమీ ఓ శృంగార పురుషుడని వ్యాఖ్యానించిన జహాన్‌.. విడాకులు ఇవ్వాలంటూ తనను షమీ కుటుంబం తనను వేధిస్తోందని ఆమె ఆరోపించారు. తనను చిత్రహింసలకు గురిచేశాడని, భార్యగా ఏనాడు చూడలేదని వాపోయింది. తన చివరిశ్వాస వరకు భర్తతో కలిసేవుంటానని, అతడికి విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేశారు.

తన భర్త చేసిన అకృత్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని, వీటితో అతడిని కోర్టుకు లాగుతానని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆమె వెల్లడించింది. హసిన్‌ జహాన్‌ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది.

Story first published: Thursday, March 8, 2018, 15:54 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి