న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ కోహ్లీ మాతో కలిసి జోకులు వేస్తాడు.. చెడ్డి దోస్త్ లాగే ఉంటాడు'

Mohammed Shami says Virat Kohli jokes with us like a childhood friend
India To Play Against Sri Lanka With Squad Of White-Ball Specialists | Oneindia Telugu

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చాలా సరదాగా ఉంటాడని, జట్టులోని అందరితోనూ కలిసిమెలిసి మెలుగుతాడని స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ తెలిపాడు. కోహ్లీ జట్టులోని ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా ఉంటాడన్నాడు. అలాగే భారత్ పేస్‌ బౌలింగ్‌ ఇంత బలంగా మారడానికి అతడి సారథ్యం కూడా ఓ కారణమని షమీ చెప్పాడు.

మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ కుమార్ మరియు ఇషాంత్ శర్మలతో టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ అటాక్ కలిగి ఉంది. మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, దీపక్ చహర్, టీ నటరాజన్, నవదీప్ సైనీ లాంటి పేసర్లు కూడా ప్రస్తుతం కోహ్లీకి అందుబాటులో ఉన్నారు.

మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు

మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు

తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన మహ్మద్‌ షమీ తన సారథి విరాట్ కోహ్లీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. 'విరాట్‌ కోహ్లీ మా పేస్‌ బౌలింగ్‌ దళానికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచాడు. మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు. మా ప్రణాళికలు విఫలమైనప్పుడు మాత్రమే అతడు కోపగించుకుంటాడు. లేకపోతే మేం ఏం చేసినా ఏమనడు. ఎప్పుడూ నాపై కానీ, మా బౌలింగ్‌ యూనిట్‌పై కానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాడు. భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ ఇంత బలంగా మారడానికి అతడి సారథ్యం కూడా ఓ కారణం. సీనియర్లతో పాటు ఎందరో యువకులు భారత జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇది మంచి వోషయం' అని షమీ క్రిక్‌బజ్‌తో తెలిపాడు.

 చిన్నప్పటి దోస్త్ లాగే

చిన్నప్పటి దోస్త్ లాగే

'సహజంగా ఏ బౌలరైనా బంతులేసే ముందు కెప్టెన్‌తో మాట్లాడటానికి కాస్త సందేహంగా ఉంటాడు. కానీ విరాట్‌ కోహ్లీ విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. బాగా బౌలింగ్ చేయమని చెప్తాడు. మాతో కలిసి జోకులు వేస్తాడు. జట్టులోని ప్రతి ఒక్కరితో సరాదాగా ఉంటాడు. అందరితో చిన్నప్పటి మిత్రుడిలా కలిసిపోతాడు. నా వరకు అయితే.. నా చిన్నప్పటి దోస్త్ లాగే కోహ్లీ కనిపిస్తాడు. అంత బాగుంటాడు మరి' అని మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు. గతకొన్నేళ్లుగా టీమిండియా బౌలింగ్‌ దళం బలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తోంది.

India vs England: ఇంగ్లండ్‌పై భారత్‌ 3-2తో సిరీస్ గెలుస్తుంది.. రాహుల్ ద్రవిడ్ జోస్యం!!

అంచలంచెలుగా ఎదుగుతూ

అంచలంచెలుగా ఎదుగుతూ

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కెరీర్ ఆరంభం నుంచి పరుగుల వరద పారించాడు. ఎంఎస్ ధోనీ నాయత్వంలో ఆడి.. అతడి దగ్గర ఎన్నో మెళుకువలు నేర్చుని సారథి అయ్యాడు. కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక సచిన్ 100 సెంచరీలకు చేరువలో ఉన్నాడు. మరొక్కటి చేస్తే రికీ పాంటింగ్ సరసన చేరుతాడు.

Story first published: Monday, May 10, 2021, 11:16 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X