Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఇంగ్లండ్‌పై భారత్‌ 3-2తో సిరీస్ గెలుస్తుంది.. రాహుల్ ద్రవిడ్ జోస్యం!!

Rahul Dravid predicts India win test series with 3-2 scoreline against England
IND VS ENG: Rahul Dravid Predicts 3-2 Win For India | Oneindia Telugu

ముంబై: వచ్చే ఆగస్టులో ఇంగ్లండ్‌లో ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో గెలిచే అవకాశం ఉందని భారత బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ జోస్యం చెప్పారు. 2007 తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ గడ్డపై చివరిగా టీమిండియా 2007లో టెస్టు సిరీస్ గెలిచింది. అది కూడా ద్రవిడ్ కెప్టెన్సీలోనే కావడం విశేషం. జూన్ 2న ఇంగ్లండ్‌కి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడబోతోంది.

వారి మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది

వారి మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది

భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ గురించి తాజాగా ఓ వెబినార్‌లో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... 'టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు మంచి అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ బౌలింగ్‌ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ముఖ్యంగా వాళ్ల సీమ్‌ బౌలింగ్‌ దాడి గొప్పగా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్‌లో చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్లో చూస్తే.. జో రూట్‌ రూపంలో టాప్‌-7లో ఒక్కడే ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌ ఉన్నాడు. బెన్ స్టోక్స్‌ కూడా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌. కానీ రవిచంద్రన్ అశ్విన్‌ ముందు అతని ఆటలు సాగే అవకాశం లేదు. వీళ్లిద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది' అని అన్నారు.

భారత్‌ 3-2తో సిరీస్ గెలుస్తుంది:

భారత్‌ 3-2తో సిరీస్ గెలుస్తుంది:

'భారత్‌ ఈ సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుందనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో సాధించిన విజయం జట్టులో నమ్మకాన్ని పెంచింది. ఆస్ట్రేలియన్లను వారి సొంత గడ్డపై ఓడించడం మామూలు విషయం కాదు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై కూడా కోహ్లీసేన రాణించింది. ప్రస్తుతం మనకు బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. గత రెండు సిరీసులలో వెనుకబడినా పుంజుకుని ట్రోఫీ గెలిచారు. ఇక ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. కాబట్టి ఇదే మనకు మంచి అవకాశం. బహుశా సిరీస్‌ 3-2తో కోహ్లీసేన సొంతమవుతుందని భావిస్తున్నా' అని ద్రవిడ్ పేర్కొన్నారు.

ఐపీఎల్ 2021 లానే.. టీ20 ప్రపంచకప్‌కు కూడా భారత్‌కు దూరమవొచ్చు!!

గొప్ప సిరీస్‌ను చూడబోతున్నాం

గొప్ప సిరీస్‌ను చూడబోతున్నాం

'కివీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా అక్కడే నెల రోజుల పాటు ఉండనుంది. ఏ ఇతర జట్టుకు కూడా ఓ టెస్టు సిరీస్‌కు సిద్ధమవడానికి ఇంత సమయం లభిస్తుందని అనుకోను. అది మనకు లాభాన్ని చేకూర్చనుంది. అక్కడి పరిస్థితులను గౌరవించాలి. బ్యాట్స్‌మన్‌కు మంచి ఆరంభాలు దక్కినా.. త్వరగా మారిపోయే పరిస్థితులు సవాళ్లు విసురుతాయి. 50 ఓవర్ల తర్వాత కూడా బంతి స్వింగ్‌ అవుతుంది. పోటాపోటీగా సాగే ఒక గొప్ప సిరీస్‌ను చూడబోతున్నాం' అని భారత మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ ఆదివారం ఓ వెబినార్‌లో చెప్పుకొచ్చారు.

భారత టెస్టు జట్టు:

భారత టెస్టు జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.

స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.

Story first published: Monday, May 10, 2021, 10:01 [IST]
Other articles published on May 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+