షమీపై ఆరోపణలు: హసిన్ జహాన్ మాజీ భర్త ఏమన్నాడో తెలుసా?

Posted By:
 Mohammed Shami's wife's ex-husband breaks silence

హైదరాబాద్: తన భర్త చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేయడంతో పాటు అతని కుటుంబ సభ్యులపై వేధింపులు, గృహహింసకు పాల్పడుతున్నారని కోల్‌కతా పోలీసులకు షమీ భార్య హసిన్ జహాన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టు నుంచి షమీని తప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వీరిద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో షమీ భార్య హసిన్ జహాన్ ఇదివరకే పెళ్లి అయిన వార్త కూడా బయటికొచ్చింది. షమీని ఆమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మాజీ భర్తతో ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో షమీ వివాదంపై హసిన్ జహాన్ మాజీ భర్త షేక్ సైఫుద్దీన్ జీ 24 గంటా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని ఇద్దరూ కలిసిపోతే బాగుంటుందని సూచించాడు. హసిన్ జహాన్‌తో తన పెళ్లి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

2002లో హసిన్ జహాన్‌తో తనకు పెళ్లి జరిగిందని, ఇద్దరం వెస్ట్ బెంగాల్‌లో ఉన్న బీర్భుమ్‌లోని సియురిలో నివసించే వాళ్లమని చెప్పాడు. 2000లో మేమిద్దరం కలుసుకున్నామని ఆ తర్వాత రెండు సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చాడు.

'మిస్ యూ బెబొ' అంటూ షమీ ట్వీట్, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన షమీ భార్య

ఆ తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టారని (2003, 2006) తెలిపాడు. అనంతరం సమస్యలు మొదలయ్యాయని, ఆమె ఉన్నత చదువులు చదువుకొని స్వతత్రంగా నిలబడాలని కోరుకుందని, మధ్య తరగతి కుటుంబం కావడంతో అది సాధ్యం కాలేదని చెప్పాడు. ఇదే విడాకులకు దారి తీసిందని 2010లో తామిద్దరం విడాకులు తీసుకున్నామని సైఫుద్దీన్ తెలిపాడు. తన ఇద్దరు పిల్లలను జహాన్ వద్దే ఉండేలా కోర్టు మొదట్లో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నాడు.

అయితే మహమ్మద్ షమీతో పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు తండ్రి వద్దకే వచ్చారు. తాజా వివాదంపై హసిన్ జహాన్ పిల్లలు కూడా స్పందించారు. హసిన్ పెద్ద కుమార్తె మాట్లాడుతూ తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, సెలవుల్లో తన తల్లిని కలుస్తామని వారు తెలిపారు. హాసిన్‌ జహాన్‌ ఫిర్యాదుతో షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు, మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ప్రస్తుతం ఈ కేసును లాల్ బజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డిటెక్టివ్ విభాగం తన చేతుల్లోకి తీసుకుంది. షమీ కేసును విమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనున్నట్టు కోల్‌కతా పోలీసులు తెలిపారు. దీంతో ఇటీవల ముగిసిన సఫారీ పర్యటన అనంతరం షమీ భారత్‌కు వచ్చేముందు ఏఏ దేశాలు, ప్రదేశాలకు వెళ్లాడో తెలపాలని అందుకు సంబంధించిన పూర్తి సమచారాన్ని తమకు ఇవ్వాల్సిందిగా కోల్‌కతా పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు.

మరోవైపు షమీ బీఎండబ్య్లూ కారులో దొరికిన ఫోనును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్ ద్వారానే షమీ వేరే మహిళలతో ఛాటింగ్ చేయడంతో పాటు వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని అందులో పలు యువతులతో కలిసి షమీ దిగిన ఫొటోలను జహాన్ కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అన్నతో రేప్ చేయించబోయాడు: షమీపై మరో బాంబు పేల్చిన భార్య

ఈ నేపథ్యంలో కేసును ఫోనులో ఉన్న డేటా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తోన్న అధికారి మాట్లాడుతూ "మొబైల్ ఫోన్‌తో పాటు ఫిర్యాదు సందర్భంగా సమర్పించిన కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశాం. కొన్ని విషయాలను పరిశీలించేందుకు మొబైల్ ఫోనును ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం పంపిచాం. అందులోని ఆడియో వాయిస్ క్లిప్పులను పరీక్షిస్తాం. ఆ ఫోన్ ద్వారా ఎవరెవరితో మాట్లాడింది తెలుసుకునేందుకు ఆ ఫోన్లో ఏ నెట్‌వర్క్, అప్లికేషన్లను ఉపయోగించారనేదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నాం" అని తెలిపారు.

Story first published: Tuesday, March 13, 2018, 18:47 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి